ఏబీ వెంకటేశ్వర రావుకు షాకిచ్చిన కేంద్రం - చార్జిషీటుకు ఓకే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఐపీఎస్ అధికారి, రాష్ట్ర నిఘా విభాజం మాజీ ఐజీ ఏబీ వెంకటేశ్వర రావుకు కేంద్రం తేరుకోలేని షాకిచ్చింది. నిఘా పరికరాల కోనుగులో వ్యవహారంపై రూ.25.5 కోట్లు వెచ్చించిన ఏబీ అందులో నిబంధనలను ఏమాత్రం పాటించలేదన్న సాకుతో వైకాపా ప్రభుత్వం ఆయనపై వేటువేసింది. తనపై విధించిన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేశారు.
ఈ అప్పీల్‌ను కేంద్ర హోం శాఖ తాజాగా తోసిపుచ్చింది. ఏబీ ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ కేంద్రం ఖరారు చేసింది. పైగా, ఆయనపై చార్జిషీటు దాఖలుకూడా అనుమతిచ్చింది. ఈ వ్యవహారంలో ఏపీపై చార్జిషీటు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఆదేశాలు జారీచేయడం గమనార్హం. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశింది.