శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 18 మార్చి 2022 (08:26 IST)

శ్రీవారి భక్తులకు శుభవార్త : 20న ఆర్జిత సేవా టిక్కెట్లు

శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) శుభవార్త చెప్పింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఉంచనుంది. కరోనా నేపథ్యంలో రెండళ్ళ క్రితం ఆర్జిత సేవలకు భక్తులను అనుమతించడాన్ని తితిదే నిలిపివేసిన విషయం తెల్సిందే. 
 
ప్రస్తుతం ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఆర్జిత సేవలకు సంబంధించిన టిక్కెట్లను ఈ నెల 20వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ టిక్కెట్లను తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్  (tirupatibalaji.ap.gov.in) వెబ్‌సైట్ ద్వారా భక్తులు టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. 
 
20వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 22వ తేదీ ఉదయం 10 గంటల వరకు సేవలకు సంబంధించిన టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్లు దక్కించుకున్న వారి వివరాలను 22న ఉదయం 10 గంటల తర్వాత వెబ్‌సైట్‌లో పెడతారు. 
 
ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో టిక్కెట్లను కేటాయిస్తారు. అలాగే, శ్రీవారి గర్భాలయంలో మూలమూర్తిని దర్శించుకున్న భక్తులను ఆలయ ఆవరణలోనే తీర్థం, శఠారి అందిస్తూ వస్తుండగా, కరోనా నేపథ్యంలో దీన్ని రద్దు చేశారు.