శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 మార్చి 2022 (13:05 IST)

తితిదే అర్జిత సేవల ధరల పెంపుపై క్లారిటీ ఇచ్చిన ఛైర్మన్

తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)లో శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్ల ధరల పెంపుపై తితిదే ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వివరణ ఇచ్చారు. రెండు సంవత్సరాల తర్వాత సర్వదర్ననాన్ని ప్రారంభించామని సర్వదర్శనం ప్రారంభమైన తర్వాత భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందన్నారు. ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగినప్పటికీ ఆలయం వద్ద ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూశామన్నారు. 
 
శ్రీవారి దర్శనం కోసం ఎంత మంది భక్తులు వచ్చినప్పటికీ వారికి ఆలయ ప్రసాదాల పంపిణీలో ఎలాంటి కొరత లేకుండా చూస్తామన్నారు. ముఖ్యంగా, భోజనంతోపాటు మూడుపుటలా రొట్టెలు, చపాతీలను భక్తులకు అందిస్తామన్నారు. తిరుమలలోమరో రెండు ప్రాంతాల్లో అన్నదాన ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. 
 
అదేసమయంలో ఇటీవల పాలక మండలి అర్జిత సేవల టిక్కెట్ ధరల పెంపునకు సంబంధించిన వీడియో వైరల్ అయిందన్నారు. అర్జిత సేవలను తిరిగి ప్రారంభించేందుకు కొంతసమయం పడుతుందన్నారు. దీనిపై కరసరత్తులు చేస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా, ఏప్రిల్ నుంచి అన్ని సేవలను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పారు. అయితే, ఏ ఒక్క సేవల ధరలను పెంచే ఆలోచన తితిదేకి లేదన ఆయన స్పష్టం చేశారు. అర్జిత సేవల ధరలను పెంచే ఉద్దేశం ఇప్పట్లో లేదన్నారు.