సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్

తెలంగాణా రాష్ట్రంలో లాక్డౌన్ : క్లారిటీ ఇచ్చిన కేటీఆర్

దేశవ్యాప్తంగా కరోనా ఉధృతి కొనసాగుతోంది. అలాగే, తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా పెరిగిపోతున్నాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో కరోనా లాక్డౌన్ తప్పదనే సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ఆస్క్ కేటీఆర్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఇందులో అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. తమ సుస్థిర, సుపరిపాలనే భారతీయ జనతా పార్టీ విద్వేష ప్రచారానికి తమ సమాధానమని అన్నారు. 
 
భాజపా విషపూరిత అజెండాను రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకుంటారని, తెలంగాణ కోసం ఎవరు పనిచేస్తున్నారో ప్రజలకు బాగా తెలుసన్నారు. పలు అంశాలపై బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఇలా అనేక ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. 
 
అంతేకాకుండా, కరోనా కేసులు, వైద్య ఆరోగ్య శాక సలహాల మేరకు రాష్ట్రంలో లాక్డౌన్, రాత్రి కర్ఫ్యూ వంటి నిర్ణయాలు ఉంటాయని వెల్లడించారు. కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయని, కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. అయితే, లాక్డౌన్ మాత్రం విధించే అవకాశాలు మాత్రం తక్కువగా ఉన్నాయని తెలిపారు.