1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 7 జనవరి 2022 (13:22 IST)

ఒమిక్రాన్ విశ్వరూపం ... తమిళనాడులో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు!

తమిళనాడు రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విశ్వరూపం చూపిస్తోంది. కరోనా కేసుల సంఖ్య కూడా నిత్యం పెరుగుతుండటంతో స్టాలిన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు మళ్లీ లాక్‌డౌన్‌ నిబంధనల్ని అమల్లోకి తీసుకుని వచ్చింది.
 
 
పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ విధిస్తూ ముఖ్యమంత్రి స్టాలిన్‌ నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు పెరిగిన వేళ అత్యవసరంగా ఉన్నతస్థాయి సమావేశం ఏర్పాటుచేసిన సీఎం స్టాలిన్ రాష్ట్రంలోని పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హెల్త్ మినిస్టర్ సుబ్రమణియన్.. హెల్త్ సెక్రెటరీ రాధా కృష్ణన్ కూడా హాజరయ్యారు. సినిమా థియేటర్లు, మెట్రోరైళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, జిమ్‌లలోకి కేవలం 50 శాతం మందిని మాత్రమే అనుమతించేలా నిబంధనలు తీసుకుని వచ్చారు.
 
 
ఆలయాలు, చర్చిలు, మసీదులు, ఇతర ప్రార్థనాలయాలకు భక్తులను అనుమతిస్తారు. వివాహాది శుభకార్యాలకు 100 మందికి.. అంత్యక్రియలకు 50 మందే హాజరవ్వాలి. రాష్ట్రంలో లేటెస్ట్‌గా 2వేల 731కేసులు వచ్చాయి. ఈ క్రమంలో స్టాలిన్ ప్రభుత్వం మరింత అప్రమత్తం అయ్యింది.