దేశంలో తొలి మరణం ఒమిక్రాన్: థర్డ్ వేవ్ రావడం ఖాయమా?
దేశంలో ఒమిక్రాన్ కారణంగా తొలి మరణం సంభవించింది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన 73 ఏళ్ల వృద్ధుడు ఒమిక్రాన్‌తో కన్నుమూయడం విషాదం నింపింది. డిసెంబర్ 15న కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడి నుంచి సేకరించిన శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా.. ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.
అయితే కోవిడ్ తీవ్రత తగ్గినా అనంతరం ఆ వృద్ధుడికి మధుమేహం, రక్తపోటు, హైపోథాయిడిజం వంటి సమస్యలు తీవ్రం కావడంతో మరణించాడు. రాజస్థాన్‌లో ఇది తొలి ఒమిక్రాన్ మరణం కాగా.. దేశంలో ఆ తర్వాత మహారాష్ట్రలోనూ ఓ ఒమిక్రాన్ సోకిన వ్యక్తి మరణించాడు.
తీవ్రత చూస్తుంటే దేశంలో థర్డ్ వేవ్ రావడం ఖాయమని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్న వారికి కూడా ఈ ఒమిక్రాన్ సోకుతుందని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు.