గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 5 జనవరి 2022 (12:08 IST)

రాధేశ్యామ్ సినిమా వాయిదా: ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ వాయిదా ప‌డింది. ఈ చిత్రాన్ని రాధాకృష్ణ తెర‌కెక్కించాడు. క‌రోనా ఆంక్ష‌ల నేప‌థ్యంలో మూవీని వాయిదా వేశారు. క‌రోనా నేప‌థ్యంలో థియేటర్లను మూసి వేయాలని పలు ప్రభుత్వాలు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాయి. 
 
ఈ నేపథ్యంలో జనవరి 14వ తేదీన విడుదల కానున్న రాధేశ్యామ్ సినిమాను వాయిదా వేసుకున్నట్లు చిత్రబృందం ప్రకటన చేసింది. అంతేకాదు ఈ సినిమాను వాయిదా వేసినందుకు ప్రభాస్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు కూడా చెప్పింది చిత్ర బృందం.
 
అలాగే ఈ సినిమాను త్వరలోనే థియేటర్లలో విడుదల చేస్తామన్నారు. దానికి సంబంధించిన తేదీని కూడా త్వరలోనే ప్రకటిస్తామని స్పష్టం చేసింది చిత్ర బృందం. ఈ మేర‌కు యూవీ క్రియేష‌న్స్ ట్వీట్ చేసింది. ఇక ఈ ప్రకటనతో ప్రభాస్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.