ఆదివారం, 3 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

కరోనా థర్డ్ వేవ్ ఎఫెక్ట్ : తమిళనాడులో సంపూర్ణ లాక్డౌన్

తమిళనాడు రాష్ట్రంలో ఆదివారం సంపూర్ణ లాక్డౌన్‌ను అమలు చేస్తున్నారు. కరోనా థర్డ్ వేవ్ కారణంగా పాజిటివ్ కేసులు అమాంతం పెరిగాయి. దీంతో ఈ వైరస్ వ్యాప్తికి రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలను చేపట్టింది. ఇందులోభాగంగా, ప్రతి రోజూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తుంది. అలాగే, ప్రతి ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలుకు ఆదేశించింది. ఇందులోభాగంగా ఆదివారం సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. 
 
ఈ లాక్డౌన్ అమల్లో భాగంగా, శనివారం రాత్రి 10 గంటల నుంచే అన్ని రహదారులను, వంతెనలను, జిల్లా, రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. దీంతో చెన్నై మహానగరంతో పాటు.. రాష్ట్రంలోని ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ఈ లాక్డౌన్ అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వం అనుమతిచ్చిన సేవలకు చెందిన వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. అలాగే, మిల్క్ షాపులు, మెడికల్ షాపులు మాత్రం తెరిచి వుంచేందుకు అనుమతి ఇచ్చారు.