తమిళనాడులో 10 వరకు స్కూల్స్ బంద్ - ఆన్‌లైన్ క్లాసులకు ఆదేశం
కరోనా వైరస్‌తో పాటు ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి శరవేగంగా సాగుతోంది. దీంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులోభాగంగా, ఈ నెల 10వ తేదీ వరకు ఒకటి నుంచి 8వ తరగతి వరకు స్కూల్స్‌ను మూసివేసింది. అయితే, 9 నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు తెరిచినప్పటికీ తల్లిదండ్రుల అనుమతి లేఖతో వెళ్లిన విద్యార్థులకు మాత్రమే ప్రవేశం కల్పిస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీచేసింది. ఇవి ఈ నెల ఒకటో తేదీ నుంచి పదో తేదీ వరకు అమల్లో ఉంటాయి.
ఇదిలావుంటే, కేంద్రం ఆదేశం మేరకు సోమవారం నుంచి చిన్నారులకు కరోనా టీకాలు వేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించనున్నారు. స్థానిక సైదాపేటలోని మాందోపు హైస్కూల్‌లో ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత విద్యార్థులందరికీ ఆయా పాఠశాలల్లోనే టీకాలు వేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.