1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 2 జనవరి 2022 (10:21 IST)

దేశంలో పెరిగిపోతున్న ఒమిక్రాన్ కేసులు - కోవిడ్ కేసులు కూడా...

దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరిగిపోతోంది. మొన్నటికి మొన్న ఈ కేసుల సంఖ్య 1431గా ఉంటే గడిచిన 24 గంటల్లో ఈ కేసులు 1,525కు పెరిగినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
మరోవైపు, దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. గత 24 గంటల్లో ఏకంగా 27,553 పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే, ఈ వైరస్ సోకి 284 మంది చనిపోయారు. అలాగే, 9,279 మంది ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,22,801 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 
 
నిజానికి గత 15 రోజుల క్రితం వరకు దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏడు వేలకు దిగువున మాత్రమే నమోదవుతూ వచ్చాయి. కానీ, సౌతాఫ్రికాలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి వెలుగు చూసిన తర్వాత ఈ కేసుల సంఖ్యలో పెరుగుదల ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో తాజాగా 27553 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.