అసెంబ్లీలో మొబైల్ ఫోన్లకు అనుమతి లేదు ... స్పీకర్ తమ్మినేని ఆర్డర్
ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. జంగారెడ్డిగూడెం కల్తీసారా మరణాలపై అసెంబ్లీ అట్టుడికిపోతోంది. కల్తీ సారా మరణాలపై టీడీపీ సభ్యులు చర్చకు పట్టుబడుతుంటే అధికార వైకాపా మాత్రం ససేమిరా అంటుంది. దీంతో టీడీపీ సభ్యులు సభలో నానా రభస సృష్టిస్తున్నారు. అదేసమయంలో టీడీపీ సభ్యులు సభలో చేస్తున్న ఆందోళన, రచ్చకు సంబంధించి వీడియో క్లిప్పులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
గురువారం ప్రారంభమైన సమావేశాల్లో కూడా టీడీపీ సభ్యులు ఆందోళన కొనసాగించారు. అసెంబ్లీ సభ్యుల మొబైల్ ఫోన్లకు అనుమతి లేదని స్పీకర్ తమ్మినేని సీతారాం వెల్లడించారు. సభా సంప్రదాయాలను ప్రతి ఒక్కరూ పాటించాలని, చర్చలకు సహకరించాలని, సభ్యులు సభలో హుందాగా మెలగాలని కోరారు. అదేసమయంలో టీడీపీ సభ్యుల ప్రవర్తినపై రూలింగ్ ఇచ్చారు.