గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 15 మార్చి 2022 (18:02 IST)

జంగారెడ్డిగూడెం మరణాలపై దద్దరిల్లిన అసెంబ్లీ.. సీఎం ఫైర్

జంగారెడ్డిగూడెంలో మిస్టరీ మరణాలపై ఏపీ అసెంబ్లీ దద్ధరిల్లింది. నాటుసారా తాగి ప్రజలు చనిపోతుంటే ప్రభుత్వానికి పట్టడం లేదని.. దీనిపై చర్చించాలంటూ టీడీపీ పట్టుబట్టింది. 
  
జంగారెడ్డిగూడెం ఇష్యూపై మంత్రులతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ఈ ఘటనపై మంత్రులు ఆళ్లనాని, నారాయణ స్వామి సీఎంకు వివరాలిచ్చారు.
 
ఈ సందర్భంగా స్పందించిన సీఎం జగన్.. టీడీపీ శవరాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలియచేయాలని మంత్రులకు సూచించారు. ఇక సభలో టీడీపీ తీరుపై మంత్రులు కన్నబాబు, కొడాలి నాని మండిపడ్డారు. 
 
జంగారెడ్డిగూడెం మరణాలపై దుష్ప్రచారం చేస్తున్నారని.., సభనూ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సభలో మాట్లాడిన మంత్రి కొడాలి నాని చంద్రబాబుపై మండిపడ్డారు.