సంబంధిత వార్తలు
- సుకుమార్ శిష్యుడి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్. కొత్త సినిమా
- చీక్స్ కాస్తా లావుగా ఉంటే ప్రెగ్నెంట్ అనుకుంటారా? వర్ష బొల్లమ్మ
- చిక్ బళ్ళాపూర్‌లో ఆర్.ఆర్.ఆర్. ప్రీరిలీజ్ వేడుక
- మరో మైలురాయిని అధికమించిన సమగ్ర భూసర్వే: డ్రోన్ సర్వేకు శ్రీకారం
- తిరుమలలో హైటెక్ దళారీ అరెస్ట్... సుప్రభాతం సేవ చేయిస్తానంటూ బురిడీ...
అసెంబ్లీలో ఐదుగురు టీడీపీ సభ్యుల సస్పెన్షన్
ఏపీ అసెంబ్లీలో ఐదుగురు టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడితో సహా ఐదుగురిని సస్పెండ్ చేయాలని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టగా.. తీర్మానం పాస్ అయినట్లు స్పీకర్ వెల్లడించారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో అచ్చెన్నాయుడు, నిమ్మల, పయ్యావుల, గోరంట్ల, వీరాంజనేయస్వామిలు ఉన్నారు.
తమను ఎందుకు సస్పెండ్ చేస్తున్నారంటూ స్పీకర్‌తో వారు వాగ్వాదానికి దిగారు. ఒక స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తితో టీడీపీ సభ్యులు ఇలా చేయడం కరెక్టు కాదని స్పీకర్ తెలిపారు. వెంటనే టీడీపీ సభ్యులను బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్‌కు సూచించారు.
