సోమవారం, 2 అక్టోబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (18:06 IST)

చీక్స్‌ కాస్తా లావుగా ఉంటే ప్రెగ్నెంట్ అనుకుంటారా? వర్ష బొల్లమ్మ

"చూసి చూడంగానే" చిత్రంతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన హీరోయిన్ వర్ష బొల్లమ్మ.. ప్రెగ్నెన్సీ వార్తలు టాలీవుడ్‌లో గుప్పుమన్నాయి. 
 
విజయ్ విజిల్ మూవీలో ఫుట్ బాల్ ప్లేయర్‌గా కనిపించారు. ఆనంద్ దేవరకొండ హీరోగా వర్ష నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ హిట్ టాక్ తెచ్చుకుంది. అలాగే పుష్పక విమానం, జాను చిత్రాల్లో క్యామియో రోల్ చేసింది. 
 
రాజ్‌తరుణ్‌తో ఆమె కలిసి నటించిన తాజా చిత్రం 'స్టాండప్‌ రాహుల్‌' మార్చి 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో హీరో, హీరోయిన్లు ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారు. 
 
ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో వర్ష తనపై వస్తున్న ప్రెగ్నెన్సీ వార్తలపై స్పందించింది.  ఈ ఇంటర్వ్యూలో రాజ్‌ తరుణ్‌ అడిగిన అన్ని ప్రశ్నలకు తనదైన శైలిలో బదులిచ్చిన వర్ష తన పెళ్లి, ప్రెగ్నెంట్‌ వార్తలపై మాత్రం కొంచెం అసహనం వ్యక్తం చేసింది. 
 
నాకు పెళ్లైయితే ఏంటీ, కాకపోతే ఏంటీ. అది నా వ్యక్తిగత విషయం అంటూ కాస్తా ముక్కుమీదు కోపం తెచ్చుకుంది. ఆ తర్వాత పెళ్లి అయ్యింది, కానీ నిజంగా కాదు.. సినిమాల్లో అంటూ చమత్కరించింది. 
 
ఇక ప్రెగ్నెంట్‌ విషయంపై స్పందిస్తూ.. ఇదంతా తన బుగ్గల వల్లే వచ్చిందని, చీక్స్‌ కాస్తా లావుగా ఉంటే ప్రెగ్నెంట్‌ అని డిసైడ్‌ అవుతారా? అంటూ సమాధానం ఇచ్చింది.