గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Updated : శుక్రవారం, 11 మార్చి 2022 (17:38 IST)

నటి ఇంట్లోకి చొరబడ్డ ఇద్దరు దొంగలు, దుస్తులు విప్పించి కత్తితో బెదిరిస్తూ...

వారిద్దరు పేరు మోసిన దొంగలు. తాళాలు వేసిన ఇంటికే తాళాలు వేస్తారు. ఇంట్లో ఎవరైనా ఉన్నా సరే చాకచక్యంగా దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఈసారి ఏకంగా తమిళనాడులోని వలసరవాక్కంలోని ఒక సినీనటి ఇంట్లో చొరబడ్డారు. ఆ నటి పలు సీరియళ్ళలో, కొన్ని సినిమాలలో నటించింది. ఆమె భర్తతో గొడవ కారణంగా ఇంట్లో ఒంటరిగానే ఉంటోంది. విషయం తెలుసుకున్న ఇద్దరు దొంగలు కన్నదాసన్, సెల్వకుమార్‌లు ఇంట్లోకి ప్రవేశించారు.

 
రాత్రి పదిన్నర సమయంలో తలుపు కొట్టారు. ఎవరా అని తలుపు తీయగానే ముసుగు ధరించిన ఇద్దరు దొంగలు లోపలికి ప్రవేశించి కత్తితో బెదిరించారు. ఆ తర్వాత దుస్తులు విప్పేయాలంటూ కత్తితో బెదిరిస్తూ అరిస్తే పొడిచేస్తామన్నారు. దాంతో చేసేది లేక నిస్సాహాయ స్థితిలో దుస్తులు విప్పేసింది. దాంతో తమ వద్ద వున్న సెల్ ఫోన్లో ఆమెను చిత్రీకరించారు. ఆ తర్వాత బీరువా తాళాలు తీసుకుని అందులో వున్న నగదు, నగలు తీసుకుని పారిపోయారు.

 
ఆ నటి పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేసింది. సి.సి. ఫుటేజ్ ద్వారా నిందితులు పాత నేరస్తులుగా గుర్తించారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి సెల్ ఫోన్ రికవరీ చేసుకునేందుకు అడిగితే పగలగొట్టిన సెల్ ఫోన్ చూపించారు. కాగా దొంగలు అఘాయిత్యం చేసిన నటి ఎవరన్న విషయాన్ని మాత్రం పోలీసులు చెప్పడం లేదు. పేరును గోప్యంగా ఉంచారు.