సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కె
Last Modified: శనివారం, 3 జులై 2021 (13:30 IST)

డొంక లాగి తీగను ప‌ట్టుకున్న శ్రీసిటీ పోలీసులు

చిత్తూరు జిల్లా స‌త్య‌వేడు పోలీసులు డొంక‌ను లాగి తీగ‌ను ప‌ట్టుకున్నారు. వారం క్రితం జ‌రిగిన శ్రీ సిటీలో కాప‌ర్ వైర్ చోరీ కేసును విజ‌య‌వంతంగా ఛేదించారు. ముగ్గురు నిందితుల నుంచి 80 కేజీల కాఫర్ స్వాధీనం చేసుకున్నారు.

ఆరూరు చెక్ పోస్ట్ వద్ధ వాహన తనిఖీలు నిర్వహించిన ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి చోరికి పాల్పడిన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ధ నుండి‌ లక్ష యాభై వేలు విలువ చేసే 80 కేజీ ల కాఫర్ ను స్వాధీనం చేసుకున్నారు. శ్రీసిటీలోని ఉత్తమాకి ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో కాఫర్ చోరి జరిగిందని గత నెల 23 న పరిశ్రమ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు.

శ్రీసిటీ డిఎస్పీ జగదీష్ నాయక్, సిఐ శ్రీనివాసులు సూచనలు మేరకు శ్రీసిటీ ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఆరూరు చెక్ పోస్ట్ వద్ధ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, చోరికి పాల్పడిన ముగ్గురిని గుర్తించారు.

తమిళనాడు తిరువళ్ళూరు జిల్లా పాలవాకంకు చెందిన యువరాజ్, భరత్, డేవిడ్ అనే ముగ్గురి నుంచి కాప‌ర్ వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో ఎఎస్ఐ షణ్ముగం, హెడ్ కానిస్టేబుళ్లు హరిబాబు, శ్రీనివాసులు, కానిస్టేబుళ్లు కిరణ్, దయాకర్, హరీష్, ప్రహ్లాద్, రాజు ఉత్తమ ప్రతిభ కనపరిచారు.