శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (10:25 IST)

శుభమన్ గిల్‌కి తప్పిన ప్రమాదం... జడేజా చాకచక్యంగా వ్యవహరించాడు..

Shubman Gill
మెల్‌బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో శనివారం ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచ్‌తో టెస్టుల్లో అరంగేట్రం చేసిన శుభమన్ గిల్.. నిమిషాల వ్యవధిలోనే గాయపడేలా కనిపించాడు. కానీ.. సీనియర్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చాకచక్యంగా వ్యవహరించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీంతో టీమిండియా యువ ఓపెనర్ శుభమన్ గిల్‌కి తృటిలో ప్రమాదం తప్పింది. 
 
ఒకవైపు శుభమన్ గిల్‌కి గాయాన్ని తప్పించిన జడేజా.. మరోవైపు క్యాచ్‌ని అందుకుని టీమిండియాకి వికెట్ చేజారకుండా జాగ్రత్తపడ్డాడు. టీ20 సిరీస్ ఆడుతూ గాయపడిన జడేజా.. మూడు వారాల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టి ఫీల్డింగ్ మెరవడం విశేషం. 
 
ఇన్నింగ్స్ 13వ ఓవర్ వేసిన ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఆస్ట్రేలియా ఓపెనర్ మాథ్యూవెడ్ (30: 39 బంతుల్లో 3X4) భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ.. మాథ్యూవెడ్ క్రీజు వెలుపలికి వస్తున్నట్లు ముందే పసిగట్టిన అశ్విన్.. బంతిని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా విసిరాడు. దాంతో.. మాథ్యూవెడ్ తాను ఆశించిన విధంగా బంతిని హిట్ చేయలేకపోయాడు. బ్యాట్ అంచున తాకిన బంతి మిడాన్- మిడ్ వికెట్ మధ్యలో గాల్లోకి లేచింది