సోమవారం, 27 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 5 డిశెంబరు 2020 (12:51 IST)

రవీంద్ర జడేజాకు గాయం.. టీ-20 సిరీస్‌కు దూరం..

భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు గాయం ఏర్పడింది. ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌‌కు అతను దూరం అయినట్లు బీసీసీఐ తెలిపింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తున్న సమయంలో జడేజాకు గాయం అయింది. దాంతో అతని స్థానంలో యుజ్‌వేంద్ర చాహల్ జట్టులో చేరాడు. కానీ మిగిలిన రెండ్లు మ్యాచ్‌లలో రవీంద్ర జడేజా స్థానంలో ఫాస్ట్ బౌలర్ శార్దుల్ ఠాకూర్ ఆడనున్నట్లు బీసీసీఐ తెలిపింది.
 
మెడికల్ టీం ఇన్నింగ్స్ విరామ సమయంలో డ్రెస్సింగ్ రూంలో జడేజాను పరీక్షించింది అని... టెస్ట్ సిరీస్‌కు అతను అందుబాటులో ఉండాలి కాబట్టి అతను ఈ పొట్టి ఫార్మాట్‌లో ఇక ఆడాడు అని బీసీసీఐ ప్రకటించింది. అయితే ఆసీస్ భారత్ గెలిచిన చివరి వన్డే అలాగే మొదటి టీ20 మ్యాచ్‌లో జడేజా కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో బ్యాట్‌తో జట్టును ఆదుకున్నాడు. ఇక ఈ రెండు జట్ల మధ్య ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది.