సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 26 మే 2021 (09:12 IST)

ప్రియుడితి భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త... ఆ తర్వాత...

కట్టుకున్న భార్య ఆమె ప్రియుడితో పడక గదిలో సన్నిహితంగా ఉండగా భర్త కళ్ళారా చూశాడు. వారిద్దరిని అసభ్యకర భంగిమలో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ విషయం గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. పిమ్మట వారిద్దరినీ ఒక స్తంభానికి కట్టేసి తీవ్రంగా కొట్టారు. 
 
ఈ దారుణ సంఘటన గుజరాత్ రాష్ట్రంలోని వ‌ల్సాద్ జిల్లాలోని ఓ గ్రామంలో జరిగింది. భార్య‌పై అనుమానం పెంచుకున్న నిందితుడు త‌ర‌చూ ఆమెతో ఘ‌ర్ష‌ణ ప‌డేవాడు. త‌న వివాహేత‌ర బంధాన్ని నిరూపించాల‌ని భార్య రెట్టించ‌డంతో నిందితుడు అవ‌కాశం కోసం ఎదురుచూశాడు. 
 
త‌న భార్య ఆదివారం ప్రియుడితో క‌లిసి కంట‌ప‌డ‌టంతో వారిని స్తంభానికి క‌ట్టేసి తీవ్రంగా కొట్టాడు. స్థానికుల జోక్యంతో బాధితుల‌ను విడిచిపెట్టాడు. పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు నిందితుడి భార్య‌, ప్రియుడు ముందుకు రాలేదు. 
 
వైర‌ల్ వీడియో ద్వారా ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ముందు జాగ్ర‌త్త‌గా నిందితుడిని అదుపులోకి తీసుకుని అనంత‌రం బెయిల్‌పై విడుద‌ల చేశారు. కాగా, భార్య‌, ప్రియుడిని స్తంభానికి క‌ట్టేసి వారిని నిందితుడు గాయ‌ప‌రుస్తున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.