ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 25 మే 2021 (20:47 IST)

భర్త, పిల్లలు నాకొద్దు.. ప్రియుడితోనే వుంటా.. వెయ్యి స్తంభాల గుడిలో పెళ్లి..!

వివాహేతర సంబంధాలతో కాపురాలు కూలిపోతున్నాయి. తాజాగా పెళ్లై ఇద్దరు పిల్లలున్నవివాహిత ప్రియుడిపై మోజుతో మొగుడు, పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయింది. తనకు మొగుడు పిల్లలు వద్దని, ప్రియుడితోనే కలిసి ఉంటానని పోలీసులను కోరింది. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా అమరచింతకు చెందిన సుజాతకు పెళ్లైంది. భర్త, పదేళ్ల కొడుకు, ఏడేళ్ల కూతురు ఉన్నారు. 
 
కానీ అదే కాలనీలో వున్న వ్యక్తితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. పిల్లలు, భర్త వున్నా.. ప్రియుడితోనే సుజాతకు కలిసి జీవించాలని వుండేది. అతను కూడా సుజాతతో కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. అంతే పిల్లలు భర్తను వదిలిపెట్టి పారిపోయింది. వరంగల్‌లో చేరుకున్నాక వారిద్దరూ భార్యా భర్తలమని చెప్పి ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడ సహజీవనం చేయసాగారు. 
 
ఇద్దరి కోసం రెండు కుటుంబాల వారు తీవ్రంగా గాలించారు. చివరకు వరంగల్‌లో ఉంటున్నట్లు తెలుసుకున్నారు. పోలీసులను ఆశ్రయించారు. అయినా ఫలితం లేదు. తాను ప్రియుడైన రాకేష్ తోనే కలిసి జీవిస్తానని… ఇద్దరం వరంగల్ వెయ్యి స్తంభాల గుడిలో పెళ్లి చేసుకున్నామని చెప్పింది. ఎన్ని కష్టాలెదురైనా రాకేష్‌తోనే ఉంటానని తెలిపింది.
 
రాకేష్ పై, తనపై వాళ్ల కుటుంబసభ్యులు దాడి చేశారని …రాకేష్‌ను తననుంచి దూరం చేశారని, రాకేష్‌ను ఎక్కడ దాచిపెట్టారో చెప్పాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రియుడితో మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా మొబైల్ కూడా అందుబాటులో లేకుండా చేశారని ఆమె ఆరోపించింది. అతడి కోసం పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసింది. సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రవీణ్ చెప్పారు.