మేనమామతో అక్కాచెల్లెళ్లకు ఒకే వేదికపై పెళ్లి.. మతిస్థిమితం లేకపోయినా..?
ప్రస్తుతం ఇద్దరిని పెళ్లి చేసుకోవటం ఫ్యాషనైపోయింది. మొన్నటికి మొన్న అదే జరిగింది. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో కూడా చోటుచేసుకుంది. తాజాగా ఓ యువకుడు ఒకే పందిరిలో ఇద్దరు అక్కచెల్లలకు తాళికట్టాడు. ఈ వివాహం మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసాన్ పల్లి గ్రామంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గొల్పాల వెంకటేష్ కు స్వాతి, శ్వేత ఇద్దరు కూతుళ్లు. పెద్ద కుమార్తె స్వాతికి మేనబావ బాల్ రాజ్‌తో వివాహం నిశ్చయమైంది. అయితే స్వాతి సోదరి శ్వేతకు మతిస్థిమితం లేదు.
ఆమెను వేరొకరికి ఇచ్చి చేస్తే ఇబ్బంది పడే అవకాశం ఉందని భావించిన తల్లిదండ్రులు మేనబావ బాల్‌రాజ్‌తో తాళికట్టించాలని అనుకున్నారు. పెళ్లి పత్రికలో కూడా ఇద్దరు వధువుల పేర్లు పెట్టారు. ఇద్దరిని ఒకే మండపంపైకి తీసుకొచ్చి తాళికట్టించారు.పెళ్లి అనంతరం బాల్ రాజ్ స్వాతిని తీసుకోని వెళ్లిపోగా వెంకటేష్ శ్వేతను తీసుకోని వారి ఇంటికి వెళ్లిపోయారు.