దిల్‌రాజుపై విమర్శలు నిజమే అన్న నిర్మాత
శ్రీవేంకటేశ్వర క్రియేన్స్ పతాకంపై పలు విజయంతమైన సినిమాలు నిర్మించిన నిర్మాత దిల్‌రాజు. దిల్ సినిమాతో సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకున్నాడు. ఆయన నిర్మాతగా ఎదగడానికి ఆయన వెన్నంటి వున్న సోదరుడు శిరీష్‌కూడా కారణమని చెబుతున్నారు మరో నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ఆయన `సినిమా చూపిస్తమామా` అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమాను నైజాంల్‌లో విడుదల చేయడానికి దిల్‌రాజుకూ సినిమా చూపించారు. అది నచ్చి దిల్ రాజు తన పంపిణీ సంస్థ ద్వారా విడుదల చేశారు. ఆ తర్వాతనుంచి వారి జర్నీ ఐదేళ్ళుగా కొనసాగుతుంది.
ఒక నిర్మాత మరో నిర్మాత పంచన చేరడం గురించి వేణుగోపాల్ స్పందిస్తూ, దిల్ రాజుగారి నుంచి నేను చాలా నేర్చుకున్నా. ఆయనో పుస్తకం. సినిమా గురించి పగలు, రాత్రి ఆలోచిస్తూనే వుంటారు. కథలో ఆయన జడ్జిమెంట్ బాగుంటుంది. ప్రతి దానిలో ఇన్ వాల్వ్ అవుతారు. కథలో సమస్య వచ్చినా టెక్నీషియన్‌తో సమస్య వచ్చినా దాన్ని ఎలా పరిష్కరించాలో ఆయనకు బాగా తెలుసు. అలాంటి విషయాలు నేను నేర్చుకున్నా. ఆయన లెజెండరీ నిర్మాత అంటూ కితాబిచ్చారు.
మరి దిల్ రాజుపై పలు విమర్శలు వచ్చాయి. వాటి గురించి వేణుగోపాల్ ప్రస్తావిస్తూ, అలాంటివి వచ్చినప్పుడు సైలెన్స్‌గా వుంటారు. ఎవరైనా ఎదుగుతుంటే ఎక్కడో చోట విమర్శలు మామూలే. వాటిని పాజిటివ్‌గా తీసుకుంటారు. ఎక్కువగా రియాక్ట్ కాడు. ఆయనకు లాస్ వచ్చినా ఎలా భర్తీ చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు అని తెలిపారు. మొదటి భార్య చనిపోవడంతో కరోనా మొదటివేవ్‌లో దిల్‌రాజు రెండో పెండ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనపై పలు విమర్శలు వచ్చాయి.
ప్రస్తుతం దిల్‌రాజు ప్యాన్ ఇండియా సినిమాలు నిర్మిస్తున్నారు. అందుకే ముంబై, చెన్నై, కేరళలో కూడా ఆఫీసులను ప్రారంభించారు. మంచి టీమ్ ఆయన వెంట వుంది.