ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : శనివారం, 27 మార్చి 2021 (06:48 IST)

మూడు భారీ సినిమాల్లో నటిస్తుండడం ఈ పుట్టినరోజు విశేషం

రామ్‌చ‌ర‌ణ్ పుట్టిన‌రోజు వేడుక‌ల్లో ప్ర‌ముఖులు

Ramcharan, birthday, celebrations
చిరంజీవి తనయుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి చిరు'త'నయుడిగా ఎంట్రీ ఇచ్చినా మొదటి సినిమాతోనే తనదైన హీరోయిజంతో ఆకట్టుకుని మెగా అభిమానులకు నిజంగా గొప్ప ఆనందాన్ని పంచారు చరణ్. ఆ సినిమా ఇచ్చిన ఊపుతో రెండో సినిమాగా మగధీర సినిమాతో సినిమా రికార్డులను బద్దలు కొట్టి.. దేశవ్యాప్తంగా చరణ్ అంటే ఇది అనే రేంజ్ స్టామినా చాటాడు. రామ్ చరణ్ మగధీర సినిమా తరువాత అయన హీరోగా వెనక్కి చూసుకోవలసిన అవసరం రాలేదు.. ఆ తరువాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్ ఏకంగా మూడు భారీ సినిమాల్లో నటిస్తుండడం ఈ పుట్టినరోజు విశేషం అని చెప్పాలి.  ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమాలో నటిస్తుండగా.. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమాలో చేస్తుండడం తో పాటు తండ్రి మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య లో కూడా కీ రోల్ పోషిస్తున్నారు.  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదినోత్సవం నేడు (శనివారం - 27) సందర్భంగా అయన జన్మదిన వేడుకలు దేశవ్యాప్తంగా  భారీ రికార్డు స్థాయిలో జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ శుక్రవారం సాయంత్రం హైద్రాబాద్ లో మెగా అభిమానుల సమక్షంలో గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకలో మెగా హీరోలతో పాటు దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో  మెగా అభిమానులు పాల్గొనడం విశేషం..ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, మెగా హీరోలు సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్, ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు, మైత్రి నిర్మాత నవీన్ యెర్నేని, స్వామి నాయుడు, యువ హీరో తేజ సజ్జ లతోపాటు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.  
 
ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ .. మెగాస్టార్ అభిమానులందరికి, పవర్ స్టార్ అభిమానులకు, మెగా పవర్ స్టార్ అభిమానులకు ధన్యవాదాలు, రామ్ చరణ్ పుట్టినరోజు సందర్బంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు. చరణ్ పుట్టినరోజు నుండి మన వేడుకలు మొదలు కానున్నాయి. చరణ్ బర్త్ డే తరువాత  రెండు రోజులకు వకీల్ సాబ్ ట్రైలర్ రానుంది. ఆ తరువాత వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ వేడుక జరుగుతాయి. మెగాస్టార్ చిరంజీవి గారు టాలీవుడ్ లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాకా మెగా హీరోలు ఎంతోమంది వచ్చారు. చిరంజీవి ఇంతింతై వటుడింతై అన్నట్ట్టు ఎదిగారు అయన దారిలో మెగా హీరోస్ అదే డెడికేషన్ తో హీరోలుగా సత్తా చాటుతున్నారు. పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, వరుణ్, సాయి ధరమ్ ఇలా హీరోలందరూ టాలీవుడ్ లో సత్తా చాటుకుంటున్నారు. ఈ ఏడాది చరణ్ కెరీర్ లో ప్రత్యేకం అని చెప్పాలి. ఎందుకంటే భారీ ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ ఆర్ ఆర్. ఆలాగే ఆచార్య లో మెగాస్టార్ తో కలిసి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. అలాగే ది గ్రేట్ శంకర్  దర్శకత్వంలో మా బ్యానర్ లో మరో ప్రతిష్టాత్మక చిత్రం ఇలా ఒకే ఇయర్ మూడు భారీ సినిమాలతో రికార్డ్ క్రియేట్ చేయనున్నాడు చరణ్ అన్నారు.
 
Sai tej and others
హీరో  సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ ... నేను హైద్రాబాద్ వచ్చిన కొత్తల్లో 2004 సమయంలో పెద్ద మామయ్యకు బర్త్ డే విషెష్ చెప్పాలి అని అనుకున్నప్పుడు బర్త్ డే వేడుకలు ఫాన్స్ తో కలిసి చేసుకుంటారని చెప్పడంతో అలాగే ఫాన్స్ తో కలిసి ఆ ఏడాది , ఆ తరువాత ఏడాది కూడా చేసుకున్నాం. ఆ తరువాత ఇన్నాళ్లకు 2021 లో ఫాన్స్ మధ్య ఇంత పెద్ద ఈవెంట్ లో మా బావ మా చరణ్ పుట్టినరోజు వేడుకలు జరగడం చాలా ఆనందంగా ఉంది. మెగా ఫాన్స్ బ్లెస్సింగ్స్ వల్లే అయన మెగాస్టార్ అయ్యారు. నేను మీకు ఓ  కథ చెబుతా ... ఓ చిన్న మామిడిపండు అక్కడ ఉంది.. స్కూల్ పిల్లలు, టీచర్ అందరు అక్కడే ఉన్నారు .. అప్పుడు టీచర్ చెబుతూ అక్కడున్న మామిడిపండు ఎవరు ముందు తీసుకుంటారో వాళ్ళకే మిగతా పళ్ళన్నీ అని చెబుతుంది. ముందు నేను మాట్లాడేది వినండి. .ఆ స్కూల్ టీచర్ చెప్పినట్టు ముందు ఆ చెట్టుదగ్గరికి వెళ్లి ఆ కాయ తీసుకుంటారో వాళ్ళకే అని చెప్పడంతో .. అందరు పిల్లలు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుంటారు .. కానీ ఒకరికి ఒకరు నువ్వు ముందా నేను ముందా అని అనుకోకుండా ఆ పిల్లలంతా కలిసి ఆ పళ్ళన్నీ జట్టు కట్టి అందరు సమానంగా తీసుకుని ఆ పళ్ళన్నీ తీసుకున్నాం... ఆ చెట్టు ఆ పళ్ళు ఎవరో కాదు మా మామయ్య మెగాస్టార్ చిరంజీవి గారు. ఆ పిల్లలు ఎవరో కాదు నేను చరణ్, అల్లు అర్జున్, శిరీష్, వరుణ్ ఇలా అందరం. మేమంతా అయన పిల్లలం. మాకు మీ సపోర్ట్ ఉంది. మీ ప్రేమకు మేమెప్పుడూ దాసులమే అన్నారు.
 
తేజ రోజా మాట్లాడుతూ .. నా బర్త్ డె సందర్బంగా చిరంజీవి గారిని కలవడం ఆ రోజు అయన తన ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో కేక్ తెచ్చి బర్త్ డే వేడుకలు జరపడం నేనెప్పటికీ మరచిపోలేను. ఆ తరువాత చరణ్ అన్న నన్ను తీసుకుని వెళ్లి నాకు బట్టలు కూడా కొనిచ్చారు .. ఈ విషయం ఎక్కడ చెప్పలేదు.. కానీ ఇప్పుడు చెబుతున్నాను.. నిజంగా చరనన్న గ్రేట్, నేను ఆ ఫ్యామిలీ లో ఒక్కడిగా నన్ను చూసినందుకు చాలా థాన్స్క్ అన్నారు.
 
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ .. రామ్ చరణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అయన మా బ్యానర్ కు గొప్ప సినిమా ఇచ్చాడు. అయన మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటున్నాను, ఇంకా చాలా చాలా మంచి సినిమాలు చేయాలి, మా బ్యానర్ లో మరోసారి అదే కాంబినేషన్ లో సినిమా చేయాలి అన్నారు.
 
దర్శకుడు బుచ్చిబాబు మాట్లాడుతూ .. నేను దిల్ రాజు గారికి పెద్ద ఫ్యాన్ ను ఎందుకంటే అయన మా గురువు సుకుమార్ గారిని దర్శకుడు చేసారు. నేను దర్శకుడు అవ్వడానికి కారణం చరణ్ గారు.. నేను ఏ కథ చెప్పినా చాలా ఇంట్రెస్ట్ గా వినేవాళ్ళు. అంతబాగా నన్ను అదరించారు ..ఆయనకు మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు.
 
హీరో వైష్ణవ తేజ్ మాట్లాడుతూ .. మెగా ఫాన్స్ అందరికి చాలా పెద్ద హాయ్. చరణ్ అన్న బర్త్ డే వేడుకలు ఇంత గ్రాండ్ గా చేసినందుకు మీ అందరికి థాంక్స్, అలాగే చరణ్ అన్న ఫాన్స్ కు చిరంజీవి మామ ఫాన్స్ అందరికి హాయ్.  ఈ వేడుకల్లో నేను పాల్గొన్నందుకు చాల ఆనందంగా ఉంది. మెగా ఫాన్స్ అందరికి మరోసారి థాంక్స్ అన్నారు.
 
ఈ వెదికపై కరోనా సమయంలో సేవలు అందించిన పలువురిని సత్కరించారు.  ఈ వేదికపై కేక్ ను కట్ చేసారు.