దిల్రాజు మోసం చేశాడంటున్న పంపిణీదారులు!
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు తమతోచేసుకున్న ఒప్పందాన్ని కాలరాశాడని గల్ప్ పంపిణీదారులు వాపోతున్నారు. ఈ విషయమై వారు సీరియస్‌గా వున్నారు. తమకు 12కోట్లు ఇవ్వాలని చట్టపరంగా కోరుతున్నారు. అసలు కారణం ఏమంటే.. వకీల్‌సాబ్ సినిమాను నేటినుంచి అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేస్తున్నారు. ఇలా హక్కులు వారికి దిల్ రాజు అమ్మేశాడు. దీనికి అమెజాన్ 14 కోట్లు చెల్లించింది. అయితే రెండు రోజులనాడే గల్ఫ్ పంపిణీదారులు దిల్‌రాజు సంప్రదించే పనిలో వుండగా ఆయన అందుబాటులో లేడని వారు పేర్కొంటున్నారు. వాస్తవానికి సినిమా థియేటర్లలో రిలీజ్అయిన యాభై రోజుల వరకూ ఏ ఓటీటీ సంస్థలో స్ట్రీమింగ్ అవ్వకూడదు అన్నది నిబంధన. అయితే అమెజాన్ వారు మాత్రం 'వకీల్ సాబ్'ను 50 రోజుల కన్నా ముందే స్ట్రీమింగ్ చేసేందుకు దిల్ రాజు తో ఒప్పందం కుదుర్చుకున్నారట.
ఇదిలా వుండగా, వకీల్‌సాబ్ ఏప్రిల్ 9న విడుదలైంది. ఆ తర్వాత రెండోవారంలోకి ప్రవేశించినప్పుడు కలెక్షన్లు తగ్గాయి. ఓటీటీలో సినిమా వస్తుందనే వార్తలు ఫిలింనగర్‌లో హల్‌చల్ చేశాయి. దీనికి సంబంధించిన కొన్ని సోషల్‌మీడియాలోకూడా వచ్చాయి. ఆ వెంటనే దిల్‌రాజు ప్రెస్‌మీట్ పెట్టి అలాంటిది ఏమీలేదని అదంతా ఒట్టి పుకారే అంటూ గట్టిగా చెప్పాడు. కానీ ప్రస్తుతం ఆయన చెప్పింది అబద్ధమని తేలింది. ఈ విషయాన్ని గల్ఫ్ పంపినీదారులు కోర్టుకు వెళ్ళనున్నట్లు తెలిసింది.
కానీ ఈ విషయం పవన్‌కళ్యాణ్ సంబంధంలేదు గనుక ఆయన ఎటువంటి సమాధానం ఇవ్వరు. దర్శకుడు వేణు శ్రీరామ్ కూడా నామ్‌కే వాస్తే. వ్యాపారా లావాదేవీలు అన్నీ దిల్రాజు చూసుకుంటాడు. కనుక వారు తమకు నష్టపరిహారంగా 12 కోట్లు అడుగుతున్నట్లు సమాచారం. మరి దీనిపై ఇంతవరకు దిల్‌రాజు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఈ సాయంత్రానికి ఆయన నుంచి వివరణ రాగలదని సినీవర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ విషయమై నిర్మాతలమండలి, ఛాంబర్ కూడా దిల్‌రాజు నుంచి సమాధానం ఆశిస్తోందని తెలుస్తోంది. కరోనావల్ల థియేటర్లు లేవుగనుక ఇలా షడెన్‌గా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని దిల్‌రాజు సన్నిహితులు చెబుతున్నట్లు సమాచారం.