బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 8 మార్చి 2022 (17:34 IST)

ప్రేక్ష‌కుల‌కు మంచి రిలీఫ్ స్టాండప్ రాహుల్- వ‌ర్ష బొల్ల‌మ్మ

Varsha Bollamma
కోవిడ్ త‌ర్వాత ఎక్కువ టెన్ష‌న్ ప‌డాల్సి వ‌చ్చింది. అందుకే థియేట‌ర్‌కు వెళ్సి హాయిగా న‌వ్వుకుంటూ బ‌య‌ట‌కు వ‌చ్చేలా వుండాల‌ని నాకు అనిపిస్తుంది. అంద‌రికీ అలానే అనిపించేలా `స్టాండప్ రాహుల్` చిత్రం వుంటుంద‌ని క‌థానాయిక వ‌ర్ష బొల్ల‌మ్మ అన్నారు.  
హీరో రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన సినిమా `స్టాండప్ రాహుల్`.  కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల‌పై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకుని ఈనెల 18న విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారంనాడు సంస్థ కార్యాల‌యంలో వ‌ర్ష బొల్ల‌మ్మ మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు విష‌యాలు తెలియ‌జేశారు.
 
- నేను ఎంచుకునే పాత్ర‌ల్లో స్క్రీన్ స్పేస్ ఎక్కువ‌గా లేక‌పోయినా పాత్ర స్ట్రాంగ్ గా వుంటే ఇష్ట‌ప‌డ‌తాను. కానీ  ఈ సినిమాలో స్క్రీన్ స్పేస్ కూడా బాగుంది. మ‌హిళ అంటే త‌ల్లిదండ్రుల‌కు, పిల్ల‌ల‌కు స‌పోర్ట్‌గా వుంటుంది. ఇందులో నా పాత్ర‌పేరు శ్రేయ‌. త‌న‌కంటూ కొన్ని డ్రీమ్స్ వుంటాయి. త‌న డ్రీమ్‌తోపాటు పార్ట‌న‌ర్ డ్రీమ్‌కూడా ఇందులో మిళితం అయివుంటుంది. అందువ‌ల్లే  రాజ్‌త‌రుణ్‌తోపాటు స‌మాన‌స్థాయి పాత్ర నాది.
 
- మొద‌ట రాజ్ త‌రుణ్‌తో న‌టించ‌డం అంటే త‌ను సీనియ‌ర్ క‌దా అనిపించింది. కానీ వ‌ర్క్ షాప్ చేసేట‌ప్పుడు త‌ను, నేను ఒకేలా ఆలోచిస్తున్నామ‌నిపించింది. త‌ను హైప‌ర్‌. జోక్స్ బాగా చెబుతాడు. దాని వ‌ల్ల చాలా కంఫ‌ర్ట్‌గా అనిపించింది. 
- నేను క‌ర్నాట‌క‌లోని కూర్గ్‌లో పుట్టి, బెంగుళూరులో చ‌దివాను. నా కుటుంబంలో సినిమారంగంలో ఎవ్వ‌రూ లేరు. నేనే కొత్త‌గా ఈ రంగంలోకి వ‌చ్చాను. పేరెంట్స్ బాగా స‌పోర్ట్ చేశారు. 
 
- ఒక‌ప్పుడు వ‌ర్క్‌షాప్లు పెద్ద‌గా వుండేవికావు.  నాకు వ‌ర్క్‌షాప్లు అంటే ఇష్టం. వీటివ‌ల్ల భాష‌తోపాటు న‌ట‌న‌ను ఫుల్ ఫిల్ చేస్తుంది. ఇంత‌కుముందు `మిడిల్ క్లాస్ మెలోడీస్‌` సినిమాకూ వ‌ర్క్ షాప్ చేశాను. ఇవి డైరెక్ట‌ర్‌ను బ‌ట్టి వుంటాయి. 
 
- సినిమానేకాదు ఏ రంగంలోనైనా మొద‌ట్లో టెన్ష‌న్ అనిపిస్తుంది. ఎక్కువ ఎఫెర్ట్ పెట్టి చేయాల‌నిపిస్తుంది. ద‌ర్శ‌కుడు శాంటో మామూలు స‌మ‌యంలో కూల్‌గా వున్నా, షాట్లోనూ ఇత‌ర్ర‌తా విష‌యాల్లో మూవీ గురించే ఎక్కువ ఫోక‌స్ పెట్టేవారు. దాంతో మ‌రింత ఇంట్రెస్ట్ క‌లిగేది.
- నా స్నేహితులుకానీ నా గురించి తెలిసిన‌వారు కానీ నేను ఈ సినిమా చేస్తున్నాను అన‌గానే నేనే స్టాండ‌ప్ కామెడీ చేస్తున్నాన‌ని అనుకున్నారు. నేను బ‌య‌ట అంత హైప‌ర్ ఏక్టివ్‌గా వుంటాను. కుళ్ళు జోక్ లు వేస్తుంటాను. అందుకే ఈ సినిమాలో ఒక్క‌సీన్ అయినా నాకు వ‌స్తుంద‌ని ఆశించా.
 
- ప్ర‌తి సినిమాకు కొత్త విష‌యాలు నేర్చుకుంటున్నాను. విజ‌య్ `బిగిల్‌` లో స్క్రీన్ ప్లేస్ త‌క్కువ‌. కానీ వ‌ర్క్‌షాప్ చేశాం. ఫుట్‌బాల్ నేర్చుకోవ‌డం వంటి విష‌యాల‌ను తెలుసుకున్నాను. ద‌ర్శ‌కుడు అట్లీ సార్ చాలా ఎన‌ర్జీగా వుంటారు. సెట్లో షాట్ అన‌గానే అప్ప‌టివర‌కు కూల్‌గా వున్న త‌ను త‌న విశ్వ‌రూపం చూపించేలా ప‌ని చేస్తారు. హార్డ్ వ‌ర్క‌ర్‌. ఆ షాట్‌లో ఆ స‌న్నివేశంలో వెంట‌నే లీన‌మైపోతారు.
 
- నాకు కొత్త బాష నేర్చుకోవ‌డం అంటే ఇష్టం. తెలుగు కూడా అలాగే నా అసిస్టెంట్ల‌తో మాట్లాడి నేర్చుకున్నా. ఆయా ప్రాంతాల క‌ల్చ‌ర్ కూడా ఇష్టం. క‌న్న‌డ‌, తెలుగు రాయ‌డంలో ఒకేలా వున్నా, మాట‌ల్లో తేడా వుంటుంది. `చూసీ చూడంగానే` సినిమా చేస్తున్న‌ టైంలోనే తెలుగు ప‌దాలు క‌న్‌ఫ్యూజ్‌గా అనిపించాయి. ఆ త‌ర్వాత గ్ర‌హించాను. మిడిల్ క్లాస్ మెలోడీస్‌కు నేనే డ‌బ్బింగ్ చెప్పాను. దాంతో ప‌ర్వాలేదు అనిపించింది.
- ఈ సినిమాలో ఫ్లాష్ బేక్‌లో క‌ళ్ళ‌కు డిఫ‌రెంట్ అద్దాలు పెట్టుకుని వుండ‌డం అనే సీన్ నాకు బాగా న‌చ్చిన అంశం.
- ఈ సినిమా నిర్మాత‌లు ద‌ర్శ‌కుడికి చాలా స్వ‌తంత్రం ఇచ్చారు. ఔట్‌పుట్ బాగా వ‌చ్చేలా స‌హ‌క‌రించారు. సెట్‌కు వ‌చ్చినా రిలాక్స్‌గా కూర్చునేవారు. 
- ద‌ర్శ‌కుడు శాంటో న‌టిగా ఏదైనా ఇన్‌పుట్ ఇస్తే దానికి వాల్యూ ఇచ్చేవారు. అప్పుడే ఓన్‌గా ఫీల‌యి పాత్ర‌ను మ‌రింత మెరుగులు దిద్దేందుకు ఉప‌యోగ‌ప‌డింది.
- నేను సినిమాలు సెల‌క్టివ్‌గా చేసుకోవ‌డంలేదు. సెలెక్టివ్‌గానే పాత్ర‌లు వ‌స్తున్నాయి. గ్లామ‌ర్ పాత్ర‌లు కంటే నాకు వ‌చ్చిన పాత్ర‌లే చేస్తున్నా. ఇలానే వుండాల‌ని రూలేమి పెట్టుకోలేదు. ప‌దేళ్ళ‌నాటికి ఇప్ప‌టికి పాత్ర‌ల్లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి.
- ఇంత‌కుముందు కామెడీ సినిమా చేయ‌లేదు. ఇది తొలిసారి. వెన్నెల కిశోర్ వంటి గొప్ప నటుడితో చేయ‌డం కొంచెం క‌ష్టంగా అనిపించింది. ఎందుకంటే స్క్రీప్ట్ లోని డైలాగ్‌లు కాకుండా ఒక్కోసారి స్పాన్ టేనియ‌స్‌గా కొన్ని ఆయ‌న చెప్పేస్తారు. అప్పుడు నేను న‌వ్వకుండా చెప్పాలి. ఇలాంటివి థ్రిల్‌గా అనిపిస్తాయి.
 - కొత్త చిత్రాలు
స్వాతి ముత్యం అనే సినిమా చేస్తున్నారు. మ‌రో సినిమా సైన్ చేశాను.