శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 10 మార్చి 2022 (09:41 IST)

వచ్చే ఎన్నికల్లో నగరి నుంచి పోటీ చేస్తున్నా : నటి వాణీవిశ్వనాథ్

వచ్చే ఎన్నికల్లో తాను చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని సినీ నటి వాణీ విశ్వనాథ్ ప్రటించారు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని మాత్రం తర్వాత వెల్లడిస్తానని తెలిపారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, తన అభిమానుల కోరిక మేరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నగరి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననే విషయాన్ని మాత్రం తర్వాత వెల్లడిస్తానని తెలిపారు. 
 
ఒకవేళ పార్టీలు తనకు టిక్కెట్ ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేస్తానని తెలిపారు. నగరిలో తమ అమ్మమ్మ నర్సుగా పని చేసిందని, ఇక్కడ తమిళ సంస్కృతి కూడా ఉందని అందుకే నగరి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు.