గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 3 డిశెంబరు 2021 (18:45 IST)

BB5: టికెట్ టు ఫైనల్‌లో నలుగురు

బిగ్ బాస్ ఐదో సీజన్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే బిగ్ బాస్ ఫైనల్ దశకు చేరుకోనుంది. టికెట్ టు ఫైనల్‌లో భాగంగా హౌస్‌మేట్స్‌కి బిగ్ బాస్ వరుస టాస్క్‌లు ఇస్తున్నారు. అందులో ముఖ్యంగా ఎండ్యూరెన్స్ టాస్క్ శ్రీరామ్, సిరి ఆరోగ్య పరిస్థితిని బాగా దెబ్బ తీసింది. ఆ తర్వాత ఫోకస్ టాస్క్ ఇచ్చారు. 
 
దీనిలో హౌస్‌మేట్స్ తమ మనస్సులో 29 నిమిషాలు లెక్కించాలి. హౌజ్ మేట్స్ వాళ్ళను డిస్టర్బ్ చేయొచ్చు. అందులో ఎవరు కరెక్ట్‌గా లెక్కిస్తారో వారు విజేత అవుతారు. ఈ టాస్క్‌లో మానస్ గెలిచాడు.
 
తర్వాత స్కిల్ టాస్క్ వచ్చింది. ఈ టాస్క్‌లో సన్నీ గెలిచాడు. చివరగా మానస్, సన్నీ, సిరి, శ్రీరామ్ ఈ రేసులో మిగిలారు. ఈ నలుగురిలో ఒకరు నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఫైనల్‌కి టికెట్ గెలుస్తారు. మరి ఈ టాస్క్‌లో ఎవరు విజేత అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది.