గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 27 నవంబరు 2021 (09:38 IST)

తితిదే శ్రీవారి దర్శన టిక్కెట్లు రిలీజ్

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి దర్శన టిక్కెట్లను తితిదే పాలక మండలి శనివారం విడుద చేసింది. డిసెంబరు కోటాకు సంబంధించి ఈ టిక్కెట్లను శనివారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో అందుబాటులోకి ఉంచింది. 
 
అదేసమయంలో తిరుమలలో భక్తుల వసతికి సంబంధించిన టోకెన్లను మాత్రం ఆదివారం విడుద చేస్తున్నట్టు పేర్కొంది. కోవిడ్ నేపథ్యంలో తితిదే ఆన్‌లైన్‌లోనే అన్ని రకాలుగా దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. 
 
కాగా, గత రెండు నెలలుగా సర్వదర్శనం టోకెన్లను కూడా తితిదే ఆన్‌లైన్‌లోనే విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో డిసెంబరు కోటా టిక్కెట్లను తితిదే విడుదల చేసింది.