గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్

పంజాబ్ ఎన్నికల బరిలో సోనూసూద్? వెల్లడించిన సోదరి మాల్విక్

వెండితెర విలన్, రియల్ హీరో సోనూ సూద్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా మహమ్మారి లాక్డౌన్ సమయంలో ఎంతో మందికి ఆపద్బాంధవుడుగా ఉన్నారు. ఆయన చేసిన సేవకు దేశవ్యాప్తంగా ప్రజలు ఆయనకు అభిమానులు అయిపోయారు. కరోనా రోగులతో పాటు..  ముఖ్యంగా వలస కూలీల విషయంలో సోను చేసిన సాయం మరువలేనిది. 
 
అయితే సోను సూద్ రాజకీయాల్లో వస్తారా? అని కొంత కాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది పంజాబ్ ఎన్నికలు రానున్నాయి. దీంతో ఈ హీరో అక్కడ ఎలక్షన్స్‌లో పోటీ చేస్తారా? అని అనేక రకాలు ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. 
 
అయితే ఈ క్రమంలో సోనూ సూద్ కీలక ప్రకటన చేశారు. ఆయన సోదరి పంజాబ్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు స్వయంగా ప్రకటించారు. సోనూ సోదరి మాల్విక వచ్చే ఏడాది జరగనున్నపంజాబ్ ఎన్నికల్లో పోటీకి దిగుతున్నట్లు తెలిపారు. అయితే ఏ పార్టీ నుంచి ఎన్నికల బరిలోకి దిగాలన్న విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.