శుక్రవారం, 1 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 30 జులై 2025 (13:45 IST)

నా ప్రియుడితో నేను ఏకాంతంగా వున్నప్పుడు నా భర్త చూసాడు, అందుకే షాకిచ్చి చంపేసాం

current shock
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో సంచలనం సృష్టించిన హత్య కేసులో మృతుడి భార్య పోలీసుల ఎదుట షాకింగ్ విషయాలను చెప్పింది. పోలీసుల విచారణలో, ఆమె నేరాన్ని అంగీకరించి హత్యకు దారితీసిన సంఘటనలను వెల్లడించింది.
 
బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో 30 ఏళ్ల వ్యక్తి సోనుని అతని భార్య స్మిత తన ప్రియుడు హరిఓంతో కలిసి హత్య చేసారు. మృతుడు సోను ఝా తన ఇంట్లో చనిపోయి పడి ఉన్నట్లు అతని తండ్రి కనుగొన్నాడు. అతని శరీరంపై అనేక గాయాలు ఉన్నాయని, పోస్టుమార్టం కోసం సదర్ ఆసుపత్రికి పంపినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య స్మితా ఝాను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 
గొడవ తర్వాత స్మిత తన ప్రేమికుడికి ఫోన్ చేసిందని పోలీసులు తెలిపారు. పోలీసుల విచారణలో స్మితా ఝా నేరాన్ని అంగీకరించి హత్యకు దారితీసిన సంఘటనలను వెల్లడించింది. తనకు హరిఓం అనే యువకుడితో వివాహేతర సంబంధం వున్నట్లు స్మిత అంగీకరించడమే కాకుండా ప్రియుడితో తను ఏకాంతంగా వుండటాన్ని తన భర్త చూసాడని చెప్పినట్లు సమాచారం. ఇక అప్పట్నుంచి తన భర్త తనతో తరచుగా గొడవలు పడేవాడని వెల్లడించింది. గత శుక్రవారం నాడు తన ప్రియుడితో గడపడంపై తన భర్త తనను నిలదీసి తనపై చేయి చేసుకున్నాడని వెల్లడించింది. ఈ విషయాన్ని ప్రియుడితో చెప్పడంతో అతడు స్మితతో కలిసి సోనుని అంతం చేయడానికి కుట్ర పన్నారు.
 
శుక్రవారం అర్థరాత్రి సోను తలపై కొట్టి స్పృహ కోల్పోయేట్లు చేసారు. ఆ తర్వాత వారు అతనిపై దాడి చేసి, విద్యుత్ షాక్ ఇచ్చి, చివరికి విద్యుత్ తీగతో గొంతును చుట్టేసి ఊపిరి ఆడకుండా చేసి చంపేసారని పోలీసు అధికారి వెల్లడించారు.