అరెరె... ఆడబిడ్డలను రక్షించాలని వెళ్తే ద్విచక్ర వాహనం చెరువులోకి ఈడ్చుకెళ్లింది (video)
సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇద్దరు యువతులు ద్విచక్ర వాహనంపై వస్తున్నారు. ఎదురుగా కారు ఆగి వుండటంతో తమ వాహనాన్ని ఆపారు కానీ బ్యాలెన్స్ కుదరక కింద పడిపోయారు. ఇంతలో వెనుక నుంచి ఓ వ్యక్తి పరుగెత్తుకుంటూ వచ్చి పడిపోయిన ద్విచక్ర వాహనాన్ని పైకి లేపాడు.
అంతే... ఆ వాహనం అతడిని పక్కనే వున్న చెరువులోకి ఈడ్చుకెళ్లింది. ఈ ఘటన చూసిన మరో వ్యక్తి పరుగెత్తుకుంటూ చెరువు వద్దకు వచ్చాడు. ఈ వీడియో ఇపుడు వైరల్ అవుతోంది.