గురువారం, 31 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 30 జులై 2025 (18:39 IST)

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

Charmi, puri, prabhas at Rajasab set
Charmi, puri, prabhas at Rajasab set
రెబల్ స్టార్ ప్రభాస్ తాజా సినిమా రాజా సాబ్. ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ శివార్లో జరుగుతుంది. అక్కడే పూరీ జగన్నాథ్, విజయ్ సేతు పతి కాంబినేషన్ చిత్రం కూడా షూటింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిన్న అనుకోకుండా పూరీజగన్నాథ్, ప్రభాస్ కలవడం జరిగింది. ప్రభాస్ షూటింగ్ పక్కనే వుందని తెలుసుకున్న పూరీ, చార్మి కౌర్ లు కలుసుకున్నారు. వెంటనే డార్లింగ్ అంటూ ఆప్యాయంగా పూరీని పలుకరిస్తూ హగ్ చేసుకున్నారు.
 
Prabhas hugs prui at Rajasab set
Prabhas hugs prui at Rajasab set
ఈ సందర్భంగా ప్రభాస్ కు పూరీ ముందుగా  విషెస్ చెప్పారు. హర్రర్ నేపథ్యంలో సాగే రాజాసాబ్ కథ గురించి తెలుసుకుని అభినందించారు. తొలిసారిగా చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కావాలని చార్మి కూడా కోరుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ రెండు షేడ్స్ వున్న పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పుడు కనిపించే పాత్ర చాలా కొత్తగా వుంది. ఇక ఈ సినిమా డిసెంబర్ 5న విడుదలచేయడానికి దర్శకుడు మారుతీ సన్నాహాలు చేస్తున్నారు. యువీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.