గురువారం, 31 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 30 జులై 2025 (19:06 IST)

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

Sattamum Neethiyum Poster
Sattamum Neethiyum Poster
తమిళంలో బ్లాక్ బస్టర్ అయిన ‘సట్టముమ్ నీతియుమ్’ ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లోకి రాబోతోంది. జూలై 18 నుంచి ఆల్రెడీ తమిళ వర్షెన్ ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు తెలుగు, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 1 నుంచి స్ట్రీమింగ్ కాబోతోందని మేకర్లు ప్రకటించారు.
 
శక్తివంతమైన ప్రదర్శనలు, ఉత్కంఠభరితమైన కోర్టు సన్నివేశాలు, భావోద్వేగాలతో కూడిన ఘర్షణలతో నిండిన ఈ సిరీస్ ఆగస్ట్ 1న తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ‘సట్టముమ్ నీతియుమ్‌’ను బాలాజీ సెల్వరాజ్ తెరకెక్కించారు. 18 క్రియేటర్స్ బ్యానర్‌పై శశికళ ప్రభాకరన్ ఈ సిరీస్‌ను నిర్మించారు. 
 
నటుడు శరవణన్ మాట్లాడుతూ .. ‘‘సట్టముమ్ నీతియుమ్’ కథ విన్న వెంటనే అది నా మనసును తాకింది. ఇది రెగ్యులర్ కోర్ట్ డ్రామా కాదు. ఈ కథ సామాన్యుడి బలం గురించి మాట్లాడుతుంది. ధైర్యంగా నిలబడి పోరాడే ఓ కామన్ మెన్‌ను చూపిస్తుంది.  ఇలాంటి ప్రాజెక్టులో నేను భాగం అవ్వాలని కథ విన్నవెంటనే నిర్ణయించుకున్నాను. 15 ఏళ్ల తరువాత మళ్లీ ఇలాంటి ఓ శక్తివంతమైన పాత్రను పోషించాను. నన్ను నమ్మి ఈ పాత్రను ఇచ్చిన దర్శకుడు బాలాజీ సెల్వరాజ్‌కు, ZEE5 టీంకి నేను కృతజ్ఞుడను. ఈ సిరీస్ అందరినీ ఆకట్టుకుంటుంది’ అని అన్నారు.