రెప్పపాటులో తప్పిన ప్రాణముప్పు... రైలు దిగుతుండగా (Video)
పలువురు ప్రయాణికులు రైలు ఆగకముందే లేదా కదులుతున్న సమయంలో ఎక్కేందుకు ప్రయత్నిస్తుంటారు. తమ ప్రాణాల మీదికి ముప్పు తెచ్చుకుంటారు. తాజాగా ఓ మహిళ రైలు ఆగకముందే రైలు దిగేందుకు ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యారు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్ జవాను క్షణాల్లో స్పందించి ఆ మహిళ ప్రాణాలను రక్షించారు. దీంతో ఆ మహిళకు రెప్పపాటులో ప్రాణాపాయం తప్పింది.
మహారాష్ట్రలోని బోరివలి రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. బోరివలి రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు నుంచి దిగుతుండగా ఓ మహిళ బ్యాలెన్స్ తప్పి ఫ్లాట్‌ఫాంపై పడిపోయింది. అక్కడ ఉన్న రైల్వే సిబ్బంది ఆమెను కాపాడారు. కదులుతున్న రైలు ఎక్కేందుకు, దింగేందుకు ప్రయత్నించవద్దని రైల్వే అధికారులు, భద్రతా సిబ్బంది పదేపదే చెబుతున్నప్పటికీ ప్రయాణికులు ఎవరూ పెద్దగా జాగ్రత్తలు తీసుకోవడం లేదు. ఫలితంగా అపుడపుడూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి.