శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 14 మార్చి 2022 (11:28 IST)

దొంగతనం కేసులో బెంగాలీ నటి అరెస్టు

బెంగాలీ నటి ఒకరు చోరీ కేసులో అరెస్టు అయ్యారు. ఆ నటి పేరు రూపా గుప్తా. వెస్ట్ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ బుక్ ఫెస్టివల్‌లో ఆమె సందర్శకులు పర్సులను చోరీ చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. దీంతో ఆమెను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ పుస్తక ప్రదర్శనకు వచ్చిన సందర్శకుడి వద్ద పర్సును కొట్టేసి, అందులోని నగదును చోరీ చేసి ఖాళీ పర్సును చెత్తబుట్టలో పడేస్తుండగా పోలీసులు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆమెను విచారించగా ఒకదానికొకటి పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. దీంతో పోలీసులు ఆమెపై చోరీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆమె బ్యాగ్‌ను తనిఖీ చేయగా, అందులో రూ.75 వేల నగదుతో పాటు మరికొన్ని పర్సులు కూడా ఉండటాన్ని గుర్తించి పోలీసులు విస్తుపోయారు.