శుక్రవారం, 29 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 మార్చి 2022 (16:38 IST)

ర్యాష్ డ్రైవింగ్ కేసులో పేటీఎం వ్యవస్థాపకుడు విజయ్ అరెస్టు

ర్యాష్ డ్రైవింగ్ కేసులో పేటీఎం వ్యవస్థాపకుడు, సీఈఓ విజయ్ శేఖర్‌ శర్మను పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన్ను స్టేషన్‌ బెయిలుపై విడుదల చేశారు. ఇది టెక్ వర్గాల్లో కలకలం రేపింది. 
 
ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు, గత నెల 22వ తేదీన విజయ్ శేఖర్ వర్మ తన ల్యాండ్ రోవర్ కారులో మదర్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి వస్తుండగా డీసీబీ బెనిటా మేరీ జాకర్‌ను ఢీకొట్టారు. ఆ తర్వాత ఆయన అక్కడ నుంచి వెళ్లిపోయారు. 
 
అయితే, డీసీపీ కారు డ్రైవర్, పోలీస్ కానిస్టేబుల్ దీపక్ కుమార్‌లు విజయ్ ల్యాండ్ రోవర్ కారును నంబరును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఆ తర్వాత స్టేషన్ బెయిలుపై విడుదల చేశారు. ర్యాష్ డ్రైవింగ్ చేశారన్న ఆరోపణలపై ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.