బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 13 మార్చి 2022 (11:51 IST)

ఎలుకలకు పెట్టిన మందు తిని 12 నెమళ్లు మృతి

తమిళనాడు రాష్ట్రంలో విషాదకర ఘటన జరిగింది. ఎలుకలను చంపేందుకు పెట్టిన మందు తిని 12 నెమళ్లు మృత్యువాతపడ్డాయి. ఈ ఘటనకు కారణమైన రైతుని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. 
 
ఈ హృదయవిదారక ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని నాచ్చియార్ కుప్పం అనే ప్రాంతంలో జరిగింది. ఈ గ్రామానికి చెందిన షణ్ముగం (75) అనే వ్యక్తి కొన్ని నెలల క్రితం ఓ మహిళకు చెందిన భూమిని కౌలుకు తీసుుకుని సాగు చేశాడు. 
 
అయితే, ఈ సాగు చేతికొచ్చే సమయంలో ఎలుకలు, నెమళ్లు ధ్వంసం చేయడాన్ని గమనించారు. దీంతో ఎలుకలను చంపేందుకు పొలంలో మందు పెట్టాడు. ఈ మందును నెమళ్లు ఆరగించాయి. దీంతో అవి ప్రాణాలు కోల్పోయాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు... చనిపోయిన నెమళ్ళను స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు రైతును అరెస్టు చేశారు.