ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 12 మార్చి 2022 (11:34 IST)

పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్ - ఉగ్రవాది హతం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఓ ఉగ్రవాదిని భారత భద్రతా బలగాలు హతం చేశాయి. పుల్వామాలోని బట్‌పోరాలో భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాదులు ఇంకా ఘటనా స్థలంలోనే దాగివున్నారు. దీంతో వారి కోసం భద్రతా బలగాలు సెర్చ్  ఆపరేషన్‌ను కొనసాగిస్తుంది. 
 
ఈ సెర్చ్ ఆపరేషన్ నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో జనసంచారం పూర్తిగా నిలిచిపోయింది. సామాన్య పౌరులను బలగాలు సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించి, ఉగ్రవాదుల ఏరివేత చర్యలు కొనసాగిస్తున్నారు. కాగా, ఈ సెర్చ్ ఆపరేషన్‌ను ఆర్మీ, సీఆర్పీఎఫ్ సంయుక్త బృందం చేపట్టింది.