సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , శనివారం, 11 డిశెంబరు 2021 (13:10 IST)

చెడ్డీ గ్యాంగ్ కోసం సెర్చ్ ఆప‌రేష‌న్... రైల్వే ట్రాక్ వ‌ద్దే ఉంటార‌ట‌!

చెడ్డీ గ్యాంగ్ పేరు చెపితేనే అంతా హ‌డ‌లిపోతున్నారు. వాళ్ళు ఏడెనిమిది మంది అపార్ట్ మెంట్ల చుట్టూ తిరుగుతూ, విజ‌య‌వాడ శివారులో హ‌ల్ చ‌ల్ చేస్తుండ‌టంతో న‌గ‌ర వాసులు గుండెల్లో రైళ్ళు ప‌రుగెడుతున్నాయి. 
 
 
విజయవాడలో న‌గ‌ర సీపీ ఆధ్వ‌ర్యంలో చెడ్డీ గ్యాంగ్ ఆచూకీ కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. 
కృష్ణా జిల్లా విజయవాడ నగరంలో వరుస చోరీలు జరుగుతున్న‌నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమైయ్యారు. నగరంలో చోరీలు చేస్తున్న వారిని చెడ్డీ గ్యాంగ్‌గా భావిస్తున్నామని సీపీ కాంతిరాణా వెల్లడించారు. ఈ తరుణంలో సీపీ గుణదల, ఉప్పులూరు, మధురానగర్‌ రైల్వేస్టేషన్లలో డీసీపీ హర్షవర్థన్‌రాజు, అదనపు డీసీపీ బాబూరావు, క్రైం ఏసీపీ శ్రీనివాసరావుతో కలిసి తనిఖీలు చేసినట్లు తెలిపారు. 
 
 
ఇక నగరంలో దొంగలను పట్టుకునేందుకు సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలుపెట్టారు. అంతేకాక ఈ ముఠాలు చోరీలకు ఇతర నగరాలకు వెళ్లినప్పుడు శివారు రైల్వేస్టేషన్ల వద్ద, రైల్వే ట్రాక్‌లకు పక్కన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటాయని మధ్యప్రదేశ్‌ పోలీసులు వెల్లడించారు.