బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By జె
Last Modified: సోమవారం, 6 డిశెంబరు 2021 (21:56 IST)

చెడ్డీ గ్యాంగ్: చిటికెలో వచ్చి చటుక్కున మాయం, పోలీసులు నిద్ర లేకుండా గాలింపు

ఎపిలో పెట్రేగిపోతున్నారు చెడ్డీ గ్యాంగ్ దొంగలు. విజయవాడ, తాడేపల్లి వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. చిట్టినగర్, గొల్లపూడి, మాచవరంలో చెడ్డీ గ్యాంగ్ వరుస చోరీలకు పాల్పడుతోంది.

 
తాడేపల్లిలో ప్రజాప్రతినిధుల ఇళ్ళలో వరుస చోరీలు జరుగుతున్నాయి. గత వారం రోజుల నుంచి చెడ్డీ గ్యాంగ్ నేరుగా అపార్టుమెంట్లోకి వెళ్ళడం.. దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నారు. ముఖ్యంగా తాళాలు వేసిన ఇంటిలోకి సులువుగా ప్రవేశించి దొంగతనాలు చేస్తున్నారు.

 
అయితే దొంగతనం తరువాత తప్పించుకు తిరుగుతున్నారు. మొత్తం 10 మంది చెడ్డీ గ్యాంగ్ రెండుగా విడిపోయి దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం చెడ్డీ గ్యాంగ్ కోసం వెతుకుతున్నారు. గత కొన్ని రోజులుగా తాడేపల్లితో పాటు పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్నారు.

 
అసలు ఈ చెడ్డీ గ్యాంగ్ వల్ల ఇంటికి తాళాలు కూడా వేసి ఎక్కడకూ బయటకు వెళ్ళలేకపోతున్నారు స్థానికులు. నిందితులు పాత నేరస్థులు కాకపోవడంతో పోలీసులు ఈ కేసు సవాల్‌గా మారింది. నిందితులను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు పోలీసులు. పోలీసులు కూడా బృందాలుగా ఏర్పడి చెడ్డీ గ్యాంగ్‌ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.