Sri Vishnu: ఛార్మినార్, ఇరానీ చాయ్ చుట్టూ సాగే కథతో అమీర్ లోగ్ ఫస్ట్ లుక్
Aamir Log's first look released by Sri Vishnu
ఎంసీ హరి, మనోజ్, శశిధర్ హీరోలుగా.. వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రమణ రెడ్డి సోమ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి మాధవి రెడ్డి సోమ నిర్మాతగా, మనోహర్ రెడ్డి మంచురి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో హీరో శ్రీ విష్ణు చేతుల మీదుగా రిలీజ్ చేయించిన అమీర్ లోగ్ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేసిన అనంతరం నటుడు శ్రీ విష్ణు టీంకి ఆల్ ది బెస్ట్ తెలిపారు. అమీర్ లోగ్ పేరుతో ఉన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ చూస్తుంటే.. ముగ్గురు స్నేహితుల చుట్టూ తిరిగే ఓ వినోదాత్మకమైన కథ అని తెలుస్తోంది.
పోస్టర్‌లో ఛార్మినార్, ఇరానీ చాయ్ అని రాసి ఉన్న బోర్డుని చూస్తుంటే ఈ స్టోరీ అంతా కూడా హైదరాబాద్ నేపథ్యంలోనే సాగనున్నట్టుగా అనిపిస్తోంది. ఈ చిత్రానికి ఎస్‌వికె సినిమాటోగ్రఫీని అందిస్తుండగా.. స్మరన్ సాయి సంగీతం అందిస్తున్నారు. రోహిత్ పెనుమత్స ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఫస్ట్ లుక్ పోస్టర్ పాజిటివ్ ఇంప్రెషన్ ఇవ్వడంతో అమీర్ లోగ్ ప్రేక్షకులలో ఇంట్రెస్ట్‌ను క్రియేట్ చేసింది. ఈ మూవీకి సంబంధించిన ఇతర విషయాల్ని త్వరలోనే ప్రకటించనున్నారు.
తారాగణం: ఎంసీ హరి, మనోజ్, శశిధర్, వేదశ్రీ, రావణ్ నిట్టూరు, విశ్వేందర్ రెడ్డి, సాయియోగి తదితరులు