గురువారం, 9 అక్టోబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Last Updated : సోమవారం, 6 అక్టోబరు 2025 (10:12 IST)

Dil Raju: తేజసజ్జా తో దిల్ రాజు చిత్రం - ఇంటికి పిలిచి ఆత్మీయ వేడుక జరిపాడు

Dil Raju congratulated the Teja Sajja Mirai team
Dil Raju congratulated the Teja Sajja Mirai team
సూపర్‌హీరో తేజా సజ్జా బాక్సాఫీస్‌ వద్ద విజయయాత్ర కొనసాగిస్తున్నారు. ఆయన తాజా చిత్రం మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన కలెక్షన్ తో దూసుకెళ్తోంది. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా ఈ సీజన్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
 
తాజాగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మిరాయ్ టీంని అభినందించారు. మిరాయ్ సినిమా విజయాన్ని పురస్కరించుకొని సూపర్‌హీరో తేజసజ్జా  కోసం తమ ఇంట్లో ఆత్మీయంగా ఒక వేడుక ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తేజసజ్జాతో పాటు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఇది అభిమానం, అభినందనలతో కూడిన ఒక ఆద్భుతమైన సందర్భంగా నిలిచింది.
 
మిరాయ్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లో 150 కోట్లు పైగా వసూలు చేసింది. నార్త్ అమెరికాలో 3 మిలియన్ డాలర్ల మార్క్‌ ని దాటింది.
 
రితికా నాయక్ హీరోయిన్‌గా, మనోజ్ మంచు, శ్రీయా శరణ్ ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రం, యాక్షన్‌ సన్నివేశాలు, విజువల్‌ ప్రెజెంటేషన్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
 
ప్రస్తుతం మిరాయ్ థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది.