సినిమా కథలు అన్నీ కల్పితాలే. సాంఘికాలు, ఇతిహాసాలు, పురణాలు ఇలా రామాయణ, మహాభారతాల్లోనుంచి ఓ అంశాన్ని తీసుకుని సినిమాలు రూపొందించడం సినిమా పుట్టుక నుంచి వున్నదే. తోలుబొమ్మలాట నుంచి వీధి నాటికలు, స్టేజీ డ్రామాలు, బుర్ర కథలు, హరి కథలు ఏదైతే ఏమీ రూపాంతరాలు చెందిన చివరికి వెండితెరపై కథలు ఎ్కువయ్యాయి. ఒకప్పుడు బుల్లితెరపైకూడా హిందీలో రామాయణం కథ వచ్చేది. అప్పట్లో అది చాలా క్రేజ్. టెక్నాలజీ లేని రోజుల్లో ఆ సీరియల్ కు ఆదరణ అంతా ఇంతా కాదు. ఆ సీరియల్ తో ప్రముఖ నటీనటులు జీవితం సెటిల్ అయిపోయింది.
సినిమా పుట్టుకే పురాణాలతో ఆరంభం
ఇక సినిమా ఆరంభంలో బ్లాక్ అండ్ కాలంలోనూ లవకుశ, రామాయణం, పాండురంగ మహాత్యం, భారతం నుంచి పలు కథలు వచ్చేవి. అందులోనూ చాలా కల్పితాలు వుండేవి. అప్పట్లో జనరేషన్ కు ఇదే నిజమని నమ్మేవారు. కాలక్రమేణా అందులో అంతా కల్పితమే అనీ, ఒక్కోసారి పురాణాలను వక్రీకరించడంతో ప్రజలు అదే నిజమని నమ్ముతున్నారని ప్రస్తుత కాలంలోని ప్రవచరణ కర్తలు, స్వామీజీలు వేలెత్తి చూపుతున్నారు.
పుక్కిటి కథలు నిజమనుకుంటున్నారు
రాముడికి మీసాలు వుండేవి కావని గతంలో సినిమాలువచ్చేవి కానీ అసలు వాల్మీకి రాసిన రామాయణంలో మీసాలు వుండేవనీ, ఆయన అరణ్యం బయలుదేరితో ఎంతోమంది పరివారం వెళ్ళేవారనీ, వారంతా దైనందిక జీవితంలో రాజుకు చేసే సేలు చేసేవారని వుందని చెబుతున్నారు. ఇలా మీసాలు లేని రాముడిని రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ లో మీసాల రాముడు చూపించగానే మేథావులు విమర్శలు సంధించారు. కానీ అసలు రామాయణంలో రాముడికి మీసాలు వుండేవని సాధువులు, స్వామీజలు చెప్పిన సందర్భాలున్నాయి. అవి సామాన్య జనాలకు తెలీవు కనుక అవి పుక్కిటి కథగా చూశారు. అందులోనూ రాముడు అరణ్యవాసం వెళ్లినప్పుడు వయస్సు కూడా చాలా తక్కువే. కానీ ప్రభాస్ ను ఆ పాత్రలో చూడలేకపోయారు. దర్శకుడు ఓ రౌత్ కూడా సరిగ్గా మలచలేకపోయాడు.
తెలుగులోనే ఇలాంటి సినిమాలు ఎందుకు వస్తున్నాయి..
ఇలా ఇలా రకరకాలు కథలు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ లో పురాణాలు చేస్తున్నాయి. కానీ ఆ పేరు తెలుగులో ఎక్కువగా పురాణాల కథలు వస్తున్నాయనేది బహిరంగ రహస్యమే. దీనిపై సీనియర్ దర్శకుడు వ్యాఖ్యానిస్తూ, మన పూర్వీకులు సాంఘికపరంగా, సామాజిక పరంగా, రాజకీయపరంగా అన్నీ చిత్రాలు టచ్ చేసేశారు. ఇంకా టచ్ చేయాల్సింది ఏమీలేదు. అపరిచితుడు, భారతీయుడు, రోబో వంటి కాన్సెప్ట్ లు కూడా సాంకేతికత అభివ్రుద్ధి చెందాక వచ్చినవే. అంతకు మించి తీయాలంటే అవతార్, గాడ్జిల్లా వంటి కథలు రావాలి. హాలీవుడ్ లోకూడా ఎటువంటి ప్రయోగం చేసినా అది రామాయణ, మహాభారతాలనుంచి స్పూర్తిగా తీసినవేనని జేమ్స్ కామరాన్ వెల్లడించారు.
హాలీవుడ్ కథలకు పురాణాలనే మూలం
రాజమౌళి ఆర్.ఆర్.ఆర్. సినిమా తీసి ఆస్కార్ అవార్డు దక్కించుకున్న సందర్భంగా రాజమౌళితో జేమ్స్ చిట్ చాట్ గా మాట్లాడుతూ, నేను తీసిన చిత్రాలు పురాణాలనుంచి స్పూర్తిగా తీసుకున్నవేఅని తేల్చిచెప్పాడు. అయితే ఆర్.ఆర్.ఆర్.లో మ్యాజిక్ చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అందుకే అంత పెద్దమనుషులు కొందరు చేసిన ప్రశంసలు ఆ సినిమాకు ఆస్కార్ వచ్చేలా చేశాయి.
కొన్ని ప్రయోగాలు బెడిసికొడుతున్నాయ్
ఇక ఆ తర్వాత తెలుగులో కార్తికేయ, కార్తికేయ 2, కల్కి, హనుమాన్ ఇలా కొనసాగుతుండగా అన్నీ విజయాన్ని సాధిస్తున్నాయి. ఇప్పుడు మిరాయ్ కు వచ్చేసరికి విమర్శకులు కూడా వెలెత్తి చూపించే సాహసం చేయలేకుండా దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని చేశాడు. దానితో ఒక్కసారిగా ఇండియా చలనచిత్ర పరిశ్రమ అంతా టాలీవుడ్ వైపు చూస్తోంది. గతంలో మణిరత్నం పురాణాలతో రావణ్ పేరుతో ప్రయోగం చేసినా అది బెడిసి కొట్టింది. పొన్నియన్ సెల్వన్ అనే మరో ప్రయోగం కూడా క్రుతంగా అనిపిస్తుంది. కానీ మిరాయ్ వచ్చేసరికి సాంకేతికంగా స్వదేశీ టెక్నాలజీతో గ్రాఫిక్స్, వి.ఎఫ్.ఎక్స్ చేసి తన సత్తా చూపించాడు గ్రాఫిక్స్ స్టూడియో అధినేత నిర్మాత విశ్వప్రసాద్.
విశ్వంభరకు పురాణాల ప్రభావం
ఇప్పుడు చిరంజీవి చేస్తున్న విశ్వంభర సినిమా కూడా డైలమాలో వుంది. అందులో చేసిన గ్రాఫిక్స్ కానీ ఇతరత్రా కానీ నాసిరకంగా వున్నాయనే టాక్ నెలకొంది. దాంతో వాయిదా మీద వాయిదా పడుతూ వుంది. తాజా గా మిరాయ్ ప్రభావంతో మరింతగా జాగ్రత్తలు తీసుకోవాలని చూస్తున్నారు నిర్మాత, హీరో చిరంజీవి కూడా. అందుకే తన తాజా సినిమా దర్శకుడు బాబీతో చేయబోతున్న సినిమాకు మిరాయ్ దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రాఫర్ గా ఎంచుకున్నాడు. అంతకుముందు ఆ సినిమాకు సెల్వన్ సినిమాటోగ్రాఫర్ కాగా, ఇప్పుడు షడెన్ గా చిరంజీవి మార్చేశాడు. ఆ పనిలోభాగం విశ్వంభర చిత్ర వివరాలను కార్తీక్ కు చెప్పినట్లు సమాచారం.
అర్జునుడి నేపథ్యంలో భారతం
ఇక పురాణాలు బాగా ఆదరణ పొందడంతో అల్లు అరవింద్ కూడా అర్జునుడు నేపథ్యంలో మహాభారతాన్ని తీయబోతున్నాడు. ఇందుకు పలువురు సీనియర్ రచయితలు దానిపై వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే రాజమౌళి మహాభారతం గురించిప్రకటించినా అది వెనకడుగు చేసింది. బాలీవుడ్ లోనూ మహాభారతాన్ని తీసే పనిలో వున్నారు. ఇక మలయాళంలో భారీ తారాగణంలో ఇదే తరహా సినిమాను ప్రకటించారు. ఇవన్నీ ఒక ఎత్తయితే, అసలు సినిమాగా ఏది తీయాలన్నా, జీవితంలో ఏది సాధించాలన్నా రామాయణ, మహాభాలే నిదర్శనమని రాజమౌళి, కార్తీక్ ఘట్టమనేని వంటివారు వ్యాఖ్యానించారు.
హిందూ ధర్మమే రక్ష
కానీ ఇతర మతాలను కించపరచకుండా మన హిందూ దర్మంలోనే చాలా నేర్చుకోవాల్సి వుందని చెప్పకనే చెబుతున్నారు. ఇతర మతాల్లో ఏసుప్రభుపై వేళ్ళమీద లెక్కించే సినిమాలే వచ్చాయి. అలాగే ఇతర మతాలకు చెందిన సినిమాలు కూడా తక్కువలో తక్కువనే చెప్పాలి. అరుంధతి వంటి కొన్ని చిత్రాల్లో మనిషిలో ఆవహించిన చెడు శక్తుల్ని పారదోలేందుకు సరిపడే కథలుగా వచ్చాయి.ఏది ఏమైనా హిందూ ధర్మానికి చెందిన కథలు ఎవర్ గ్రీన్ అంటూ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఆ దిశలో వారు చేసినవి కల్పితాలే. అవే నిజాలు అనుకోకండి అని సినిమా ఆరంభంలోనే చెప్పాల్సిన అవసరం వుందని నొక్కి చెబుతున్నారు.