శుక్రవారం, 5 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : బుధవారం, 3 సెప్టెంబరు 2025 (19:18 IST)

Murugadoss: దాని వల్లే ఐదేళ్ల టైం వృథా అయింది. మన దగ్గర ప్రపంచస్థాయి కంటెంట్ వుంది : ఏఆర్ మురుగదాస్

AR Murugadoss
AR Murugadoss
నేను ప్రతీ సినిమాను మొదటి సినిమాగానే భావిస్తాను. మదరాసి విషయంలోనూ అలాంటి ఫీలింగ్‌‌తోనే ఉన్నాను. డిఫరెంట్ కథతో అందరి ముందుకు రాబోతోన్నాను. ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుందనే కాన్ఫిడెంట్‌తో ఉన్నాను అని దర్శకుడు ఏఆర్ మురుగదాస్ అన్నారు.
 
శివ కార్తికేయన్, రుక్మిణి వసంత్, విద్యుత్ జమ్వాల్ ప్రధాన పాత్రలో ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన చిత్రం మదరాసి. అనిరుధ్ సంగీతాన్ని అందించారు. సెప్టెంబర్ 5న విడుదల చేయబోతోన్నారు. తెలుగులో ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ మూవీస్ బ్యానర్ మీద భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో దర్శకుడు మురుగదాస్ చిత్ర విశేషాల్ని పంచుకున్నారు.
 
మదరాసి టైటిల్ పెట్టడానికి గల కారణం ఏంటి?
మామూలుగా మన దక్షిణాది వారిని ఉత్తరాదిలో మదరాసి అని పిలుస్తుంటారు. ఈ చిత్రం ఎక్కువగా విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతుంది. విలన్ ఈ మూవీలోని హీరోని మదరాసి అని పిలుస్తుంటాడు. అందుకే టైటిల్ కూడా మదరాసి అని పెట్టాను.
 
ఇతర ప్రాంతాల వారు రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నారా?
మదరాసి కథ మొత్తంగా తమిళనాడు నేపథ్యంలో సాగుతుంది. అందుకే టైటిల్‌ అలా పెట్టాం. నేను బెంగళూరులో కథ జరుగుతుంటే మదరాసి అని టైటిల్‌ను పెట్టలేను కదా. ఇందులోని కంటెంట్, కథ అన్ని ప్రాంతాలకు కనెక్ట్ అవుతుంది.
 
కథ ఎలా ఉండబోతోంది?
వెస్ట్రన్ కంట్రీస్‌లో ఆల్రెడీ ఉన్న సమస్యలు, మన దేశంలోకి వస్తున్న ఇలాంటి ఓ కొత్త సమస్యను బేస్ చేసుకుని ఈ కథను రాసుకున్నాను. ఇందులోని సబ్జెక్ట్ చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. అందరూ తెలుసుకోవాల్సిన పాయింట్ అనుకుని.. ఈ మదరాసి మూవీని తెరకెక్కించాను.
 
 శివ కార్తికేయన్‌ను ఎందుకు అప్రోచ్ అయ్యారు?
చిత్రంలో హీరో పాత్ర చాలా డిఫరెంట్‌గా, కొత్తగా ఉంటుంది. శివ కార్తికేయన్‌కు ఈ కథ చెప్పిన వెంటనే నచ్చడం, వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయింది. ప్రస్తుతం శివ కార్తికేయన్‌కు మాస్‌లో మంచి ఇమేజ్ పెరిగింది. అలాంటి మాస్ హీరోతో నేను చెప్పాలనుకున్న ఈ పాయింట్‌ను చెబితే ఎక్కువ రీచ్ అవుతుంది.
 
 రుక్మిణి వసంత్ పాత్ర ఎలా ఉంటుంది?
రుక్మిణి వసంత్ పాత్ర చాలా రియలిస్టిక్‌గా ఉంటుంది. అందరికి రిలీటే అయ్యే కారెక్టర్‌ను ఆమె చేశారు. ప్రస్తుతం రుక్మిణి వసంత్ గారు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయారు.
 
విద్యుత్ జమ్వాల్ ప్రస్తుతం హీరోగా చేస్తున్నారు. మీరు మళ్లీ విలన్ పాత్రకి ఎలా ఒప్పించారు?
తుపాకి కథను విద్యుత్ జమ్వాల్‌కి చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయి ఒప్పుకున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా సినిమాలు చేస్తున్నారు. హాలీవుడ్ ప్రాజెక్ట్‌ని కూడా ఆయన చేస్తున్నారు. ఈ కథను ఆయనకు చెప్పిన వెంటనే చాలా నచ్చడంతో విలన్‌గా చేసేందుకు ఒప్పుకున్నారు.
 
మీ చిత్రాల్లో యాక్షన్ సీక్వెన్స్‌ అద్భుతంగా ఉంటాయి. మరి మదరాసిలో ఎలా ఉండబోతోన్నాయి?
యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా వచ్చాయి. మరీ ముఖ్యంగా సెకండాఫ్‌లో వచ్చే పోరాట సన్నివేశాలు అదిరిపోతాయి. హీరో, విలన్ మధ్య వచ్చే యాక్షన్ ఘట్టాలు ఆడియెన్స్‌ను అబ్బురపరుస్తాయి.
 
అనిరుధ్ మ్యూజిక్ ఎలా ఉండబోతోంది?
ప్రస్తుతం అనిరుధ్ మ్యూజిక్‌కు బ్రాండ్‌గా ఉన్నారు. ఇంత వరకు మ్యూజిక్ అంటే.. పాటలు, లిరిక్స్ అనుకునేవారు. కానీ అనిరుధ్ మాత్రం బీజీఎంతో దేశాన్ని ఊపేస్తున్నారు. ఈ చిత్రంలో అనిరుధ్ అద్భుతమైన మ్యూజిక్, ఆర్ఆర్ ఇచ్చారు. నేను చేసిన సీన్లను అనిరుధ్ తన ఆర్ఆర్‌తో నెక్ట్స్ లెవెల్‌కు తీసుకు వెళ్లారు. మంచి సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేలా అనిరుధ్ ఆర్ఆర్ ఇచ్చారు. అనిరుధ్ ఇంకా ఎంతో ఎత్తుకు వెళ్తారు. మ్యూజిక్‌ వరల్డ్‌లో ఇంకా గొప్ప స్థాయిని చేరుకుంటున్నారు.
 
మీకు ఐదేళ్ల గ్యాప్ ఎందుకు వచ్చింది?
ఈ ఐదేళ్లలో నేను ఎప్పుడూ ఖాళీగా ఉండలేదు. మధ్యలో ఓ యానిమేషన్ ప్రాజెక్ట్ కోసం చాలా పని చేశాను. కానీ చివరకు అది మెటీరియలైజ్ అవ్వలేదు. టెక్నీషియన్‌గా నేను ఎప్పుడూ ఖాళీగా అయితే లేను. ఆ ప్రాజెక్ట్ వల్లే చాలా టైం వృథా అయింది. అందుకే ఈ గ్యాప్ వచ్చింది.
 
సౌత్ ఇండియన్ సినిమా ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతోంది కదా?
సౌత్‌లో మన ఆడియెన్స్ సినిమాని ఎక్కువగా ప్రేమిస్తారు. సినీ లవర్స్ మన దగ్గరే ఎక్కువగా ఉంటారు. ఓ నలుగురు కలిస్తే కచ్చితంగా సినిమా గురించి మాట్లాడుకుంటారు. మన దగ్గర ప్రస్తుతం ప్రపంచస్థాయి కంటెంట్ వస్తోంది. మన ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది.
 
మీ ప్రొడక్షన్ కంపెనీలో నెక్ట్స్ మూవీ ఎప్పుడు రాబోతోంది?
చాలా కథలు వింటున్నాను. అందులో కొన్ని ఫైనలైజ్ చేశాం. కానీ వాటి గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. త్వరలోనే మా ప్రొడక్షన్ కంపెనీ నుంచి పట్టాలెక్కే చిత్రాల గురించి అప్డేట్ ఇస్తాను.
 
దర్శకుడిగా నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి చెప్పండి?
ప్రస్తుతానికి నా వద్ద చాలా ఐడియాలు, కాన్సెప్ట్‌లు ఉన్నాయి. కానీ పర్టిక్యులర్‌గా ఈ మూవీ అని ఏమీ అనుకోలేదు. స్క్రిప్ట్ ఫైనలైజ్ అయ్యాక నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి చెబుతాను.