అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన మేయర్ భాగ్యలక్ష్మి
భావి తరాలకు అంబేద్కర్ జీవితం ఆదర్శప్రాయమని, ఆయన ఆశయాలకు అనుగుణంగా యువత దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేతం వద్ద అంబేద్కర్ విగ్రహనికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, శాసనసభ్యులు మల్లాది విష్ణు తదితరులతో కలసి మేయర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. భారత దేశానికి అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని అందించి ప్రజాస్వామ్య వ్యవస్థ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన మహనీయుడు అంబేద్కర్ అన్నారు.
నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఛాంబర్లో విద్యా దాత ఫౌండేషన్ ద్వారా 46వ డివిజన్ పరిధిలోని సెయింట్ థామస్ పబ్లిక్ స్కూల్ లో చదువుతున్న అఖిల్ అనే విద్యార్ధికి, 10వ తరగతి చదువుకొడానికి కావలసిన ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమములో విద్యాదాత ఫౌండర్ తమ్మిన రవీందర్ పాటు కామరాజు హరీష్, సాజిద్ తదితరులు పాల్గొన్నారు.