శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 డిశెంబరు 2021 (18:55 IST)

వెన్నుపోటు’పై బాలయ్య వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

నటసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన తాజా చిత్రం అఖండ. బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ బ్యానర్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్‌ ఇందులో హీరోయిన్‌.

శ్రీకాంత్ ఈ చిత్రంలో విలన్‌గా నటించాడు. థమన్ దీనికి సంగీతం అందించాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా ఘన విజయాన్ని అందుకుంది.
 
తాజాగా ఆహా టాక్ షో Unstoppable with NBK ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో చాలా విషయాలు బాలయ్య షేర్ చేసుకున్నారు. కానీ చివర మాత్రం కాస్త ఎమోషన్ చోటుచేసుకుంది. వెన్నుపోటుపై బాలయ్య స్పందించడమే ఇందుకు కారణం. 
 
చివర్లో బాలయ్య మాట్లాడుతూ.. ‘ఈ సందర్భంగా ఒకటి చెప్పాలి. వెన్నుపోటు పొడిచారు అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. చెబుతుంటే కళ్లలో నీళ్లు వస్తుంటాయి. ఎందుకంటే నేను ఆయన కొడుకుల్లో ఒకడిని మాత్రమే కాదు.. అంతకుమించి ఆయన అభిమానిని' అంటూ ఎమోషనల్ అయ్యారు బాలయ్య. ఈ ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది.