చిత్తూరు జిల్లాలో నెమళ్లు మృతి: ప్రమాదకరమైన బ్యాక్టీరియాతో..
చిత్తూరు జిల్లాలో నెమళ్లు మృతి చెందడం కలకలం రేపింది. చిత్తూరు జిల్లాలోని సోమల మండలంలో ఏడు నెమళ్లు చనిపోయాయి. మిట్టపల్లె సమీపంలోని పూలకొండ వ్యవసాయ పొలాల్లో మృతి చెందిన ఏడు నెమళ్లను స్థానికులు గుర్తించారు.
వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలానికి పశు వైద్య సిబ్బందితో చేరుకున్న అధికారులు నెమళ్లను పరిశీలించారు.
నెమళ్ల కళేబరాల్లో ప్రమాదకరమైన బ్యాక్టీరియా ఉన్నట్లుగా గుర్తించారు. నెమళ్ల మృతిపై అటవీశాఖ అధికారి శంకరశాస్త్రి మాట్లాడుతూ.. బ్యాక్టీరియా వల్లనే నెమళ్లు చనిపోయాయని వెల్లడించారు. గాలి ద్వారానే ఈ వైరస్‌తో నెమళ్లుకు సోకిందని అధికారులు భావిస్తున్నారు.