1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. btech student haardhika death in chittor district krishnapuram

బిటెక్ విద్యార్థిని హార్దిక‌... పెళ్ళి కాకుండానే శ‌వ‌మై!

btech student
పెద్దతిప్ప సముద్రంలో మ‌రో యువ‌తి అనుమానాస్ప‌దంగా మృతి చెందింది. చిత్తూరు జిల్లాలో పి పి టి ఎం మండలం కృష్ణాపురం గ్రామ సమీపంలోని పొలం వద్ద హార్దిక అనే బీటెక్ విద్యార్థిని మృత‌దేహం ప‌డి ఉంది. మృతురాలు బీ.కొత్తకోట కు  చెందిన హార్దిక 19 గా పోలీసులు గుర్తించారు. మదనపల్లె ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ద్వితీయ సంవత్సరం విద్యనభ్యసిస్తున్న విద్యార్థి హార్దిక ఆదివారం సాయంత్రం ద్విచక్ర వాహనం నేర్చుకుంటానని వెళ్లిన కూతురు కనపడకపోవడంతో తల్లిదండ్రులు వెతుకులాడుతున్నారు. 
 
 
చివ‌రికి ఆ యువ‌తి కృష్ణాపురం పొలాల వద్ద మృతి చెంది ఉండడాన్ని పోలీసులు గ‌మ‌నించారు. బడికాయలపల్లికు చెందిన యువకుని ప్రేమించింది కులాలు వేరు కావడంతో పెద్ద మనుషులు విడ‌దీశార‌ని ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. మృతదేహాన్ని కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. కేసును బి.కొత్తకోట ఎస్ ఐ మధు రామచంద్రుడు ద‌ర్యాప్తు చేస్తున్నారు.
About Writer
జెఎస్కే
తర్వాతి కథనం
టిడిపి నేత బుద్ధ వెంకన్న అరెస్ట్; ఇంటికి వెళ్ళి మ‌రీ అరెస్ట్!