సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: సోమవారం, 20 డిశెంబరు 2021 (15:32 IST)

చిత్తూరుజిల్లాలో జల్లికట్టు.. ఇద్దరికి గాయాలు..?

నూతన సంవత్సరం వస్తోందంటే చాలు జల్లికట్టు గుర్తుకు వస్తుంది. జల్లికట్టు అంటే ఎక్కడా ఉండదు. ఒక్క చిత్తూరు జిల్లాలోనే ఆ ఆట కనిపిస్తూ ఉంటుంది. జల్లికట్టు అంటే పశువులను వదిలే వాటికి కట్టి కొమ్ములను పట్టుకునేందుకు ప్రయత్నం చేస్తుంటారు. గ్రామస్తులు ఏ మాత్రం వెనక్కితగ్గరు. రక్తం కారుతున్నా..గాయాల పాలైనా పట్టించుకోరు. ఒక సాంప్రదాయ క్రీడగా దీన్ని కొనసాగిస్తుంటారు.

 
అయితే ఇంకా కొత్త సంవత్సరం రాలేదు కదా..అప్పుడే జల్లికట్టు గురించి మాట్లాడుకుంటున్నారు ఎందుకు అనుకుంటున్నారా.. నూతన సంవత్సరానికి ముందుగానే చిత్తూరుజిల్లాలోని పలు గ్రామాల్లో జల్లికట్టు జరుగుతూ ఉంటుంది. 

 
ఆదివారం కావడంతో చిత్తూరుజిల్లాలోని రామచంద్రాపురం మండలం కూనేపల్లిలో జల్లికట్టు జరిగింది. మధ్యాహ్నం ప్రారంభమైన జల్లికట్టు మూడుగంటల పాటు జరిగింది. అయితే రంకెలేసిన కోడిగిత్తలను పట్టుకునేందుకు పోటీలు పడ్డారు.

 
ఇందులో ఇద్దరికి గాయాలయ్యాయి. గాయాలపాలైన వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులు జల్లికట్టును నిర్వహించకూడదని ఆంక్షలు విధించినా గ్రామస్తులు ఏ మాత్రం పట్టించుకోలేదు. జల్లికట్టును ఒక సాంప్రదాయ క్రీడగా కొనసాగిస్తూనే ఉన్నారు.