గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 11 నవంబరు 2021 (20:53 IST)

చిత్తూరు జిల్లాలో భూమి నుంచి వింత శబ్దాలు, ఉలిక్కిపడి లేచి పరుగులు తీస్తున్న ప్రజలు

మనం పడుకున్నప్పుడు భూమి నుంచి ఒక్కసారిగా వింతైన శబ్దం వస్తే ఏమవుతుంది. ఒక్కసారి భయంతో లేచి పరుగులు తీస్తాం. ఇప్పుడు ఇలాంటి ఘటనలు చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు నియోజకవర్గంలోని అబ్బగుండు గ్రామంలో చోటుచేసుకుంది. గత 10 రోజులుగా భూమి లోపల నుంచి వింత శబ్దాలు వస్తుండటంతో తాము భయాందోళనకు గురవుతున్నట్లు స్థానిక ప్రజలు చెపుతున్నారు. 

 
ఆ వింత శబ్దాలు ప్రస్తుతం రాత్రి మాత్రమే కాకుండా పగలు కూడా భయపెడుతున్నాయి. దీనితో అధికారులకు సమాచారం అందించారు. పరిశీలించేందుకు వచ్చిన అధికారులకు కూడా ఆ శబ్దాలు రావడం విని షాక్ తిన్నారు. మైనింగ్ వల్లనే ఇలాంటి శబ్దాలు వస్తున్నట్లు గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు. దీనితో అసలు సమస్య ఏమిటో నిర్థారిస్తామని అధికారులు చెప్పి వెళ్లారు.